Breaking News

బంగ్లాలో హిందువుల దాడులపై అమెరికా నిఘా

Published on Thu, 03/20/2025 - 07:50

వాషింగ్టన్‌ డీసీ: బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులపై అమెరికా(America) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ దేశంలో మైనారిటీలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు  పేర్కొంది. ఏ దేశంలోనైనా మైనారిటీలపై జరిగే హింస, అసహనాన్ని తాము వ్యతిరేకిస్తామని స్పష్టం చేసింది.  బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులపై నిఘా సారిస్తున్నామని వెల్లడించింది.

మరోవైపు బంగ్లాదేశ్‌లోని ప్రజల భద్రత కోసం అక్కడి తాత్కాలిక ప్రభుత్వంgovernment) తీసుకుంటున్న చర్యలను  స్వాగతిస్తున్నామని కూడా అమెరికా పేర్కొంది. బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న దాడులను నిరంతరం గమనిస్తున్నామని, వీటిని నియంత్రించేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని  తాము ఆశిస్తున్నామని పేర్కొంది. బంగ్లాదేశ్‌పై నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బర్డ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రశ్నించినప్పుడు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బ్రూస్ ఈ విధంగా స్పందించారు.

బంగ్లాదేశ్‌(Bangladesh)లో 2024 ఆగస్టు 5న అప్పటి ప్రధాని షేక్ హసీనాను పదవీచ్యుతురాలిని చేసినప్పటి నుండి హిందువులను  లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి. హిందువుల ప్రార్థనా స్థలాలు, మతపరమైన ప్రాంతాలను ధ్వంసం చేస్తున్నారు. హిందువుల ఇళ్లను తగులబెట్టి, ధ్వంసం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా బంగ్లాదేశ్‌లోని మహ్మద్ యూనస్ ప్రభుత్వం  మౌనం వహిస్తున్నదనే ఆరోపణలున్నాయి.

ఇది కూడా చదవండి: శంభు సరిహద్దులో ఉద్రిక్తత.. రైతులను ఖాళీ చేయించిన పోలీసులు

#

Tags : 1

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)