తైవాన్‌కు రూ.లక్ష కోట్ల ఆయుధాలు 

Published on Fri, 12/19/2025 - 06:29

వాషింగ్టన్‌/బీజింగ్‌: చైనాతో టారిఫ్‌ల యుద్ధం ఓ వైపు కొనసాగిస్తూనే, మరో వైపు తైవాన్‌కు భారీగా అత్యాధునిక ఆయుధాలను విక్రయించేందుకు అగ్రరాజ్యం అమెరికా సిద్దమైంది. ఏకంగా రూ.1 లక్షా 188 కోట్లు(11.1 బిలియన్‌ డాలర్లు) విలువైన క్షిపణులు, హోవిట్జర్లు, డ్రోన్లు తదితర అత్యాధునిక ఆయుధాలను విక్రయించనున్నట్లు ట్రంప్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించిన అధ్యక్షుడు ట్రంప్‌..విదేశాంగ విధానానికి సంబంధించిన అంశాలను గానీ, చైనా, తైవాన్‌ల గురించి గానీ ప్రస్తావించలేదు. ట్రంప్‌ ప్రతిపాదనకు కాంగ్రెస్‌ ఆమోదం తెలిపిన పక్షంలో.. తైవాన్‌కు అమెరికా అందించే అతిపెద్ద ఆయుధ ప్యాకేజీగా నిలవనుంది. 

తైవాన్‌ రక్షణ శాఖతో కుదిరిన 8 ఒప్పందాల్లో 82 హై మొబిలిటీ ఆరి్టలరీ రాకెట్‌ వ్యవస్థలు(హైమార్స్‌), 420 ఆర్మీ టాక్టికల్‌ మిస్సైల్‌ సిస్టమ్స్‌(అట్‌కామ్స్‌), 60 సెల్ఫ్‌ ప్రొపెల్డ్‌ హొవిట్జర్‌ వ్యవస్థలు, డ్రోన్లు, మిస్సైళ్లు ఉన్నాయి. ఎప్పటికైనా తైవాన్‌ తమ దేశంలో కలిసిపోవాల్సిందేనంటున్న చైనా.. ఇటీవల ఆ దిశగా దూకుడుగా వ్యవహరిస్తోంది. అంతేకాదు, అమెరికా–చైనాల మధ్య సంబంధాలు ఇప్పటికే ఉప్పూనిప్పుగా సంబంధాలు కొనసాగుతున్న వేళ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయంపై డ్రాగన్‌ దేశం తీవ్రంగా స్పందించింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఒకే చైనా విధానానికి అమెరికా తూట్లు పొడిచిందని, తమ ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగించేలా వ్యవహరిస్తోందని మండిపడింది.  

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)