దాడి చేసిన దొంగకు తిండి పెట్టి మరీ సాగనంపి..!

Published on Fri, 08/04/2023 - 17:05

ఎవరైనా దొంగ ఇంట్లోకి చొరబడితే ఏం చేస్తాం.. పోలీసులకు పట్టిస్తాం. వీలైతే దాడి నుంచి తప్పించుకుంటాం.. తప్పని స్థితిలో ప్రతిదాడి చేస్తాం కదా..! కానీ ఎవరైనా దొంగకు తిండి పెట్టి మరి సాగనంపుతామా? వింటేనే నవ్వొస్తుంది కదా..! అమెరికాలో ఓ మహిళ తన ఇంట్లోకి చొరబడిన దొంగకు తిండి పెట్టి మరీ సాగనంపి గొప్ప మనసు చాటుకుంది. 

ఆమె పేరు మార్జోరీ పార్కిన్స్(87) ఒంటరిగా నివసిస్తోంది. జులై 26 అర్థరాత్రి తన ఇంట్లోకి ఓ దొంగ ప్రవేశించి దాడికి యత్నించాడు. ఇది గమనించిన పార్కిన్స్ తనను తాను కాపాడుకోవడానికి ప్రతిదాడి చేసింది. ఈ క్రమంలో ఆ దొంగ.. ఆమెను నెట్టివేశాడు. దీంతో ఆమె కిచెన్‌లోకి చేరుకోగలిగింది. అయితే.. కిచెన్‌లోకి చెరుకున్నాక దొంగను డోర్‌తో నిలువరించింది. ఈ క్రమంలో దొంగ.. తనకు ఆకలిగా ఉందని తెలిపాడు. ఈ దయగల పార్కిన్‌.. అతనికి ఆహారాన్ని అందించి పోలీసులకు ఫోన్ చేసింది. పోలీసులు వచ్చేలోపు ఆ దొంగ చక్కగా తినేసి.. ఏ వస్తువులను తీసుకుపోకుండా అన్నీ అక్కడే వేసి పారిపోయాడు. 

నేరాలు ఇలా జరగడం దురదృష్టంగా భావించిన పార్కిన్.. నేరస్థులకు శిక్షలు సరిగా వేయడం లేదని అన్నారు. తాను 42 ఏళ్లుగా ఒంటరిగా జీవిస్తున్నానని ఎప్పుడూ ఇలాంటి ఘటనలు ఎదురవలేదని చెప్పారు. చట్టాలను ప్రజలు లెక్కచేయలేని స్థితిలో ఉన్నాయని వాపోయారు. అయితే.. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ యువకున్ని అదుపులోకి తీసుకున్నారు.        

ఇదీ చదవండి: పైశాచికత్వం: యువతిని 14 ఏళ్లు బందించి.. శృంగార బానిసగా మార్చి..

#

Tags : 1

Videos

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

సుప్రీం చెప్పినా లెక్కలేదు.. కూటమికి అడుగడుగునా జగన్ భయం

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)