పైశాచికత్వం: యువతిని 14 ఏళ్లు బందించి.. శృంగార బానిసగా మార్చి.. | Sakshi
Sakshi News home page

పైశాచికత్వం: యువతిని 14 ఏళ్లు బందించి.. శృంగార బానిసగా మార్చి..

Published Wed, Aug 2 2023 8:33 PM

Man Kidnapped Teen Kept Her As Hot Slave In His House For 14 Years - Sakshi

రష్యాలో అతి కిరాతక ఘటన వెలుగులోకి వచ్చింది. యువతిని 14 ఏళ్లుగా ఒకే ఇంట్లో బందించి శృంగారానికి బానిసగా మార్చుకున్నాడో వ్యక్తి. ఇన్నేళ్లుగా ఆమెను బయటకు వెళ్లనీయకుండా బందించి, దాదాపు 1000 సార్లకు పైగా అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా మహిళను అనేక పర్యాయాలు హింసించి రాక్షసంగా ప్రవర్తించాడని పేర్కొన్నారు. నిందితున్ని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ రష్యాలోని చెల్యాబిన్స్క్‌లో వ్లాదిమిర్ చెస్కిడోవ్(51) అనే వ్యక్తి రాక్షస ప్రవృత్తిని ప్రదర్శించాడు. ఇంటికి ఆల్కహాల్ పార్టీకి పిలిచి ఎకటెరినా అనే యువతిని 2009లో బందించాడు. బెడ్‌రూం నుంచి ఆమె బయటకు రాకుండా నిర్భందించాడు. దాదాపు 1000కి పైగా సార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. ప్రస్తుతం ఆమె వయస్సు 33 ఏళ్లు. 

అతని తల్లి సహాయంతో..
వ్లాదిమిర్ చెస్కిడోవ్ ఇటీవల మానసిక రుగ్మతలతో బాధపడుతున్నాడు. ఈ కారణంతో ఆస్పత్రికి వెళ్లాడు. ఈ క్రమంలో బాధిత మహిళకు  చెస్కిడోవ్ తల్లి సహాయం చేసింది. బయటకు పారిపోవడానికి ఏర్పాటు చేసింది. దీంతో బయటకు వచ్చి పోలీసులకు జరిగిన ఉదంతాన్ని వివరించింది. కత్తితో బెదిరించేవాడని తెలిపింది. చిన్న చిన్న విషయాలకు తీవ్రంగా హింసించేవాడని వెల్లడించింది. దీంతో ఇన్నేళ్లుగా సాగిన బయంకరమైన ఘటన బయటకొచ్చింది.      

ఇదీ చదవండి: యుద్ధఖైదీల పట్ల అమానుషం.. లైంగికంగా వేధించి.. చిత్రహింసలకు గురిచేసి..

సెక్స్ టాయ్, శృంగార సీడీలు..
బాధిత మహిళ చెప్పిన విషయాల ఆధారంగా స్మోలినో గ్రామంలోని  నిందితుని ఇంటికి వెళ్లిన పోలీసులకు బయంకరమైన వస్తువులు కనిపించాయి. చెస్కిడోవ్ ఇళ్లు సెక్స్ టాయ్స్, శృంగార వీడియోలతో నిండి ఉంది. ఇంటి నేలమాళిగలో మానవ అవశేషాలు కూడా కనిపించాయి.

మరో మహిళతో..
నిందితుని ఇంటి నుంచి బయటకొచ్చిన ఎకటెరినా.. పోలీసులకు మరో విషయాన్ని వెల్లడించింది. తనను బందించిన ఇంటికే మరో మహిళా ఖైదీని కూడా చెస్కిడోవ్ తీసుకువచ్చాడని తెలిపింది. 2011లో జరిగిన గొడవలో ఆమెను అంతమొందించినట్లు పోలీసులకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. ఆ మహిళను అనేక సార్లు పొడిచి అత్య చేసినట్లు వెల్లడించింది. 

కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. మానసిక రోగంతో ఉన్న నిందితున్ని ఆస్పత్రిలో తమ సమక్షంలో ఉంచినట్లు తెలిపారు. 

ఇదీ చదవండి: దక్షిణాఫ్రికా రాజకీయాలు హింసకు దారి తీస్తున్నాయా?

Advertisement
 

తప్పక చదవండి

Advertisement