ట్రంప్‌పై కుట్ర.. ఇరాన్‌కు అమెరికా వార్నింగ్‌

Published on Tue, 10/15/2024 - 12:29

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై ఇటీవల కాలం చోటుచేసుకున్న హత్యాయత్నానికి సంబంధించిన ఘటనలపై అగ్రరాజ్యం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.అయితే ట్రంప్‌.. ఇప్పటికే ఇరాన్‌ దేశ హిట్‌లిస్ట్‌లో ఉండటంతో టెహ్రాన్‌కు జో బైడెన్‌ ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ట్రంప్‌ హత్యకు కుట్రలు చేసినా.. యుద్ధాన్ని ప్రేరేపించే చర్యగా భావిస్తామని వైట్‌ హౌజ్‌ మంగళవారం ఓ ప్రకటనవిడుదల చేసింది.

‘‘మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా ఇరాన్ నుంచి వచ్చే బెదిరింపులను కొన్నేళ్లుగా పర్యవేక్షిస్తున్నాం. అమెరికా పౌరుడిపై ఏదైనా దాడి జరిగితే తీవ్ర పరిణామాలుంటాయి.ఈ భద్రతాపరమైన అంశాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటున్నాం. అత్యంత ప్రాధాన్యత కలిగిన జాతీయ, స్వదేశ భద్రత అంశంగా పరిగణిస్తున్నాం. ఇరాన్ బెదిరింపులకు తీవ్రంగా ఖండిస్తున్నాం​.అమెరికాకు సేవలను కొనసాగించే వారితో సహా, గతంలో సేవలందించిన వారి, అమెరికా పౌరులపై ఇరాన్ బెదిరింపులకు పాల్పడితే.. తీవ్ర పరిణామాలను ఎదుర్కొవల్సి ఉంటుంది’’ అని వైట్ హౌస్ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి సీన్ సావెట్ అన్నారు.

మరోవైపు.. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా అమెరికాతో పరోక్ష చర్చలను విరమించుకున్నట్లు ఇరాన్ సోమవారం ప్రకటించింది. రెండు దేశాల మధ్య ప్రత్యక్ష దౌత్య సంబంధాలు లేవు. అయితే  ఈ రెండు దేశాల మధ్య ఒమన్‌ను కీలక మధ్యవర్తిగా  ఉ‍న్న విషయం తెలిసిందే. ఒమన్ రాజధాని మస్కట్‌లోమీడియాతో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుత సంక్షోభ పరిస్థితులు అదుపులోకి వచ్చే వరకు చర్చలకు జరిగే అవకాశాలు కనిపించటం లేదు’’అని అన్నారు.

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)