Breaking News

ఇరాన్‌కు అమెరికా హెచ్చరిక.. పశ్చిమాసియాలో సైనిక విస్తరణ

Published on Sat, 11/02/2024 - 07:16

న్యూయార్క్‌: పశ్చిమాసియాలో ఇ‍జ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలుస్తోంది. ఈ క్రమంలో ఇరాన్‌కు హెచ్చరికగా అగ్రరాజ్యం అమెరికా చర్యలు చేపట్టింది. పశ్చిమాసియాలో బాలిస్టిక్ క్షిపణి రక్షణ డెస్ట్రాయర్లు, దీర్ఘ-శ్రేణి బీ-52 బాంబర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లతో సహా అదనపు సైనిక  పరికరాలు మోహరిస్తున్నట్లు అమెరికా శుక్రవారం ప్రకటించింది. ఇరాన్, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇదొక హెచ్చరిక అని పేర్కొంది.

"ఇరాన్.. ఆదేశ అనుబంధ మిలిటెంట్‌ గ్రూపులను అమెరికన్ సిబ్బంది లేదా మిత్రదేశాల ప్రాంత ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకోవడానికి వినియోగిస్తే అమెరికా సైతం మా ప్రజలను రక్షించుకునేందుకు అవసరమైన ప్రతి చర్యను తీసుకుంటుంది. మిడిల్ ఈస్ట్‌లో ఇజ్రాయెల్‌కు మద్దతుగా  అమెరికా అదనపు సైనిక, రక్షణ వనరులను విస్తరిస్తాం. గత నెల చివరిలో మోహరించిన THAAD క్షిపణి రక్షణ వ్యవస్థతో సహా అమెరికా సైన్యం నిర్వహిస్తుంది. అదనపు సైన్యం.. రాబోయే నెలల్లో రావడం మొదలవుతుంది’’ అని పెంటగాన్ ప్రతినిధి మేజర్ జనరల్ పాట్ రైడర్ ఓ ప్రకటనలో వెల్లడించారు.  

అక్టోబరు 26న ఇరాన్‌పై ఇజ్రాయెల్ భారీ దాడులతో విరుచుకుపడింది. కీలకమైన సైనిక, ఆయిల్ స్థావరాల మౌలిక సదుపాయాలను నాశనం చేసింది. మరోవైపు.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఇరాన్.. ఇజ్రాయెల్‌పై రెండుసార్లు మిసైల్స్‌తో దాడులకు దిగింది. ఏప్రిల్‌లో డమాస్కస్‌లోని తన కాన్సులేట్‌పై ఇజ్రాయెల్‌ సైన్యం దాడి చేసిందని ఆరోపణలు వచ్చాయి. అనంతరం ఇరాన్‌.. ఇజ్రాయెల్‌ దాడి చేసింది. తమ దేశం మద్దతు ఇస్తున్న మిలిటెంట్‌ గ్రూప్‌ నేతల హత్యకు ప్రతిస్పందనగా అక్టోబర్‌లో మరోసారి  ఇజ్రాయెల్‌పై విరుచుకుపడిన విషయం తెలిసిందే.

చదవండి:  ఇజ్రాయెల్‌ హై అలర్ట్‌..  ఇరాన్‌ ప్రతీకార దాడి చేస్తుందని అనుమానం

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)