Breaking News

ట్రంప్‌ ప్రమాణ స్వీకారానికి ముందే అమెరికాకు తిరిగి వచ్చేయండి

Published on Sat, 11/30/2024 - 04:46

న్యూయార్క్‌: అమెరికా 47వ అధ్యక్షుడిగా జనవరి 20న డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే.. శీతాకాల సెలవులకు స్వదేశాలకు వెళ్లిన అంతర్జాతీయ విద్యార్థులు అమెరికాకు తిరిగి వచ్చేయాలని పలు యూనివర్సిటీలు సూచించాయి. ప్రవేశాల నిషిద్ధం, విమానాశ్రయాల్లో నిబంధనలు కఠినతరం అయ్యే అవకాశాలుంటాయి కాబట్టి జనవరి 20కి ముందే తిరిగి వచ్చేయాలని భారతీయ విద్యార్థులను పలు వర్సిటీలు హెచ్చరించాయి. 

వలసదారులను అమెరికా చరిత్రలోనే ఎన్నడూ లేనంత అత్యధికంగా వెనక్కి పంపిస్తానని ట్రంప్‌ ఎన్నికల ప్రచారంలో పదేపదే చెప్పడాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సూచన జారీచేశాయి. చెల్లుబాటయ్యే వీసా, ఇతర ప్రయాణ పత్రాలు సక్రమంగా ఉన్న భారతీయ విద్యార్థులకు వచ్చే నష్టమేమీ లేకున్నా.. అవకాశం తీసుకోవద్దని హెచ్చరించాయి. అమెరికా వర్సిటీల్లో చదువున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో భారత విద్యార్థులే అధికం కావడం గమనార్హం. 

2023–24 కాలంలో భారత విద్యార్థులు చైనాను వెనక్కినెట్టి అగ్రస్థానాన్ని ఆశ్రయించారు. అమెరికా వర్సిటీల్లో 3.3 లక్షల భారతీయ విద్యార్థులు ఉండగా.. చైనా విద్యార్థులు 2.7 లక్షల మంది ఉన్నారు. సాధారణంగా అయితే నూతన సంవత్సర వేడుకల తర్వాత వారం రోజులకు తరగతులు ప్రారంభమవుతాయని, ట్రంప్‌ వైఖరిని దృష్టిలో పెట్టుకొని ఈసారి జనవరి 2 నుంచే తరగతులు మొదలుపెడుతున్నారని ఒక విద్యార్థి తెలిపారు.

 జనవరి మొదటి వారాంతం తర్వాత రావడం రిస్క్‌ అవుతుందని ప్రొఫెసర్లు చెప్పినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా అమెరికాకు తిరిగి వెళ్లాలని తమపై ఒత్తిడి ఉందని తెలిపారు. అమెరికాకు ఎప్పుడు తిరిగి రావాలనే విషయంలో సందేహాలను తీర్చడానికి యేల్‌ యూనివర్సిటీ అయితే విద్యార్థులకు ప్రత్యేకంగా ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. 

అమెరికాకు వెళ్లడానికి జనవరి 10న రిటర్న్‌ టికెట్‌ను బుక్‌ చేసుకున్నానని, అయితే మసాచుసెట్స్‌ యూనివర్సిటీ సూచన మేరకు రూ.35 వేలు అదనంగా పెట్టి.. తిరిగివెళ్లే తేదీని ముందుకు జరిపానని ఎస్‌.సర్సన్‌ అనే విద్యార్థి తెలిపారు. నిబంధనలు కఠినతరం కావచ్చని, నిశిత పరిశీలన, తనిఖీలు ముమ్మరం కావచ్చని తమ ప్రొఫెసర్లు చెప్పారని వెల్లడించారు. పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదని, అనవసరంగా సమస్యలు కొనితెచ్చుకొనే బదులు.. ముందుగా అమెరికాకు తిరిగి రావడమే ఉత్తమమని వెస్లెయాన్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ఒకరు అన్నారు.  

అమెరికాలో యూనివర్సిటీ విద్యార్థులకు ట్రంప్ ఎఫెక్ట్
 

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)