Breaking News

ఇరాన్ యుద్ధం తీవ్రరూపం.. భారత పౌరులకు కేంద్రం హెచ్చరిక

Published on Mon, 07/20/2026 - 07:23

మధ్యప్రాచ్యంలో అమెరికా–ఇరాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులు కొనసాగుతున్న వేళ, ఇరాక్‌లో జరిగిన ఓ ఆపరేషన్‌లో అమెరికా సైనికుడు మరణించగా, మరో సైనికుడు గాయపడ్డాడు. దీంతో, ఇరాన్‌పై దాడుల మరింత పెంచాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆదేశాలిచ్చారు. ఇదే సమయంలో ఇరాన్‌కు ప్రయాణాలను నివారించాలని, ఇప్పటికే అక్కడ ఉన్న భారతీయులు భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దేశం విడిచి రావడాన్ని పరిశీలించాలని భారత్ సూచించింది.

అమెరికా సైనికుడు మృతి
అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకారం, ఉత్తర ఇరాక్‌లో కూలిపోయిన ఇరాన్‌కు చెందిన ఒక డ్రోన్‌లోని పేలని ఆయుధ భాగాలను నిర్వీర్యం చేసే సమయంలో అమెరికా సైనికుడు ప్రాణాలు కోల్పోగా, మరో సైనికుడు స్వల్పంగా గాయపడ్డాడు. జూలై 18న ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో సైనికుల వివరాలను వారి కుటుంబాలకు సమాచారం ఇచ్చిన తర్వాత వెల్లడిస్తామని CENTCOM తెలిపింది. ఈ తాజా మరణంతో గత దాదాపు ఐదు నెలలుగా కొనసాగుతున్న ఘర్షణల్లో మరణించిన అమెరికా సైనికుల సంఖ్య 17కు చేరింది.

ఇరాన్‌పై వరుస దాడులు
ఉద్రికత్తల నేపథ్యంలో ఇరాన్‌పై అమెరికా మరోసారి వైమానిక దాడులు ప్రారంభించింది. ఇది వరుసగా తొమ్మిదో రాత్రి దాడులుగా CENTCOM పేర్కొంది. హర్మూజ్ జలసంధి ద్వారా ప్రయాణించే వాణిజ్య నౌకలు, పౌర నావికులపై దాడులకు ఉపయోగిస్తున్న ఇరాన్ సైనిక సామర్థ్యాలను బలహీనపరచడమే తమ లక్ష్యమని అమెరికా తెలిపింది. అయితే తాజా దాడుల్లో ఏ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నారో, ఎంత నష్టం జరిగిందో అమెరికా అధికారులు ఇంకా వెల్లడించలేదు. అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్‌లోని పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు అక్కడి మీడియా తెలిపింది.

ఇరాన్ ప్రయాణంపై భారత్ కీలక సూచన
పశ్చిమాసియా ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం భారత పౌరులకు ప్రయాణ సూచన జారీ చేసింది. ఇరాన్‌కు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని భారత్ కోరింది. ప్రస్తుతం ఇరాన్‌లో ఉన్న భారతీయులు తమ భద్రతను దృష్టిలో ఉంచుకుని తాత్కాలికంగా దేశం విడిచి వెళ్లే అవకాశాలను పరిశీలించాలని సూచించింది. ఇరాన్‌లో ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, స్థానిక అధికారుల సూచనలు పాటించాలని, తాజా భద్రతా పరిస్థితులను గమనించాలని భారత రాయబార కార్యాలయం సూచించింది.

బహ్రెయిన్‌లో అమెరికా పౌరులకు హెచ్చరిక
ఇదే సమయంలో బహ్రెయిన్‌లోని అమెరికా రాయబార కార్యాలయం కూడా భద్రతా హెచ్చరిక జారీ చేసింది. ఇరాన్ నుంచి ముప్పు ఉందని సమాచారం అందినట్లు పేర్కొంది. అమెరికా పౌరులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)