Breaking News

వచ్చేస్తోంది ‘డూమ్స్‌ డే’ క్షిపణి

Published on Thu, 03/05/2026 - 11:55

ఇరాన్‌పై యుద్ధం నానాటికీ భీకర స్థాయికి చేరుతున్న నేపథ్యంలో అమెరికా కీలక చర్యకు దిగింది. ‘డూమ్స్‌డే’మిసైల్‌గా పేరొందిన మినట్‌మ్యాన్‌–3 ఖండాంతర క్షిపణిని పరీక్షించింది! అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి అమెరికా వైమానిక దళ గ్లోబల్‌ స్ట్రైక్‌ కమాండ్‌ కాలిఫోర్నియాలోని వాండెన్‌బర్గ్‌ స్పేస్‌ ఫోర్స్‌ బేస్‌ నుంచి ఈ క్షిపణిని ప్రయోగించింది. 

అది ఏకంగా 4,200 మైళ్లకు పైగా దూరం ప్రయాణించి పశ్చిమ మధ్య పసిఫిక్‌లోని మార్షల్‌ దీవుల సమీపంలో రోనాల్డ్‌ రీగన్‌ బాలిస్టిక్‌ మిసైల్‌ టెస్ట్‌ సైట్‌ వద్ద లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించినట్టు అమెరికా ప్రకటించింది. జీటీ 255గా పేర్కొంటున్న ఈ క్షిపణి ప్రయోగానికి ఇరాన్‌పై యుద్ధంతో సంబంధం లేదని స్పష్టం చేసింది. క్షిపణి వ్యవస్థ తాలూకు విడి భాగాల పనితీరు తదితరాలను పూర్తిస్థాయిలో మదింపు వేసేందుకే పరీక్ష జరిపినట్టు 576వ ఫ్లైట్‌ టెస్ట్‌ స్క్వాడ్రన్‌ కమాండర్‌ లెఫ్టినెంట్‌ కల్నల్‌ క్యారీ రే తెలిపారు. దీర్ఘకాలిక అవసరాల రీత్యా అమెరికా అణుపాటవం నిత్యం యుద్ధ సన్నద్ధంగా ఉండేందుకు ఈ పరీక్ష తోడ్పడుతుందని అభిప్రాయపడ్డారు.

రేంజ్‌ 6,000 కి.మీ. పైనే
మినట్‌మ్యాన్‌–3 క్షిపణి సామర్థ్యం అంతా ఇంతా కాదు. అమెరికా వ్యూహాత్మక క్షిపణి వ్యవస్థకు ఇది గుండెకాయ వంటిదంటే అతిశయోక్తి కాదు! అణ్వస్త్ర సామర్థ్యంతో కూడిన దీని రేంజ్‌ ఏకంగా 6,000 కి.మీ. పై చిలుకే! గంటకు 24 వేల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. రెండో ప్రపంచయుద్ధ కాలంలో హిరోషిమాపై పడ్డ అణుబాంబు కంటే ఏకంగా 20 రెట్లు శక్తిమంతమైన అణు వార్‌హెడ్లను ఈ క్షిపణి మోసుకెళ్లగలదు! ఖండాలకు ఆవల ఉన్న లక్ష్యాలను కూడా నిమిషాల వ్యవధిలో తుత్తునియలు చేయగలదు. అమెరికా ఇప్పటికే దీన్ని పలుమార్లు పరీక్షించి చూసింది. చివరిసారి గత నవంబర్‌లో దీన్ని పరీక్షించింది. ఈ క్షిపణుల తయారీని 1979లో మొదలు పెట్టారు.

ఆ పేరెందుకు?
అమెరికా అణ్వాయుధ సంపత్తిలో అత్యంత వినాశనకరమైన అస్త్రం మినట్‌మ్యాన్‌–3యే. అణుయుద్ధం అంటూ వస్తే ఇది సృష్టించే విధ్వంసం అంచనాలకు కూడా అందదు. అక్షరాలా ప్రళయం సృష్టిస్తుందనే అర్థంలో దీనికి డూమ్స్‌ డే అనే ముద్దుపేరు వచ్చింది. మినట్‌మ్యాన్‌–3 రేంజ్‌ 6,000 కి.మీ. అని అమెరికా చెబుతున్నా వాస్తవానికి అంతకంటే చాలా ఎక్కువగా ఉంటుందన్నది రక్షణ నిపుణుల మాట. భూమిపై ఏ లక్ష్యాన్నయినా ఛేదించగల సామర్థ్యం దీని సొంతమని చెబుతారు. పైగా ఈ క్షిపణి ఘన ఇంధనంతో నడుస్తుంది. దాంతో నిత్యం అప్రమత్తంగా ఉంటుంది. 

సమస్య తలెత్తితే క్షణాల వ్యవధిలో సిద్ధమై శత్రువు పని పట్టగలదు. పైగా మల్టిపుల్‌ ఇండిపెండెంట్లీ రీ ఎంట్రీ వెహికిల్స్‌ (ఎంఐఆర్‌వీ)లను మోహరించే సామర్థ్యం కూడా మినట్‌మ్యాన్‌–3 సొంతం. కనుక ఒకే ప్రయోగంతో ఏకకాలంలో బహుళ లక్ష్యాలను అలవోకగా ఛేదించగలదు. అమెరికా వద్ద ప్రస్తుతం ఈ క్షిపణులు 400కు పైగా ఉన్నట్టు అంచనా. వీటిని అమెరికా పశ్చిమ ప్రాంతంలో అత్యంత గోప్యంగా భూగర్భ కేంద్రంలో మోహరించి ఉంచారు. అండర్‌గ్రౌండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ద్వారా వీటిని నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. ఒకవేళ దానితో సంబంధం తెగిపోయినా ప్రత్యేకంగా రూపొందించిన ఈ–6బీ లాంచ్‌ కంట్రోల్‌ విమానం నుంచి ఈ క్షిపణులను ఆపరేట్‌ చేసే సౌలభ్యం కూడా ఉంది.                    

 – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Videos

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు