Breaking News

ట్రంప్‌ టారిఫ్‌ దడ.. షాపింగ్‌ మాల్స్‌ ముందు లాక్‌డౌన్‌ దృశ్యాలు

Published on Sun, 04/06/2025 - 12:54

వాషింగ్టన్‌: అమెరికాలోని సూపర్ మార్కెట్లన్నీ వినియోగదారుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. ఇక్కడికి వచ్చిన జనమంతా తమకు అందిన వస్తువులన్నింటినీ కొనుగోలు చేసి, తమ ట్రాలీలలో నింపేసుకుని, బయటకు వస్తూ కనిపిస్తున్నారు. దీనిని చూసినవారికి త్వరలో లాక్‌డౌన్‌(Lockdown) వస్తుందనే విధంగా అక్కడి దృశ్యాలు కనిపిస్తున్నాయి. అమెరికాలో ప్రస్తుతం ‘ఇప్పుడే షాపింగ్‌ చేయండి.. లేదంటే పశ్చాత్తాప పడతారు’ అనే ట్రెండ్‌ నడుస్తోంది.

అమెరికాలోని వినియోగదారులు షాపింగ్‌ మాల్స్‌కు పరుగులు తీయడం వెనుక ప్రధాన కారణం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త టారిఫ్ పాలసీ(Donald Trump's new tariff policy). ఏప్రిల్ 2న డోనాల్డ్ ట్రంప్ భారత్‌, చైనాతో సహా పలు దేశాల నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై భారీ సుంకాలను విధించారు. దీనిపై అమెరికన్లు  కలత చెందుతున్నారు. రాబోయే రోజుల్లో పలు వస్తువులు చాలా ఖరీదైనవిగా మారుతాయని  ఆందోళన చెందుతున్నారు. ఈ భయంతోనే వారంతా ఉప్పు మొదలుకొని టీవీలు, ఫ్రిజ్‌లు.. ఇలా అన్నింటికీ కొనుగోలు చేస్తున్నారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం ట్రంప్ ప్రభుత్వ సుంకాల విధానం దిగుమతులపై(imports) ప్రత్యక్ష ప్రభావాన్ని చూపనుంది. ఇది కంపెనీల ఖర్చును పెంచుతుంది. ఫలితంగా ఆ భారం కస్టమర్‌పై పడుతుంది. అయితే డోనాల్డ్ ట్రంప్ అమెరికాకు ఈ సుంకాలు  మేలు చేస్తాయని చెబుతున్నారు.  అమెరికన్లు ప్రస్తుతం చేస్తున్న షాపింగ్‌ తీరు చూస్తుంటే.. వారెవరికీ ట్రంప్  హామీలపై పెద్దగా నమ్మకం లేదని  అనిపిస్తుంది. ప్రస్తుతం అమెరికాలో ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు మైక్రోవేవ్‌లు  అత్యధిక సంఖ్యలో అమ్ముడవుతున్నాయి.

అమెరికాకు ఎలక్ట్రానిక్స్ వస్తువులు, విడిభాగాలు చైనా తదితర దేశాల నుండి దిగుమతి అవుతాయి. సుంకాల పెరుగుదల కారణంగా భవిష్యత్తులో అవి మరింత ఖరీదైనవిగా మారే అవకాశం ఉంది. సుంకాలు విధించాక ధరలలో 15-20శాతం మేరకు పెరుగుదల తప్పకుండా ఉంటుందని డీలర్లు స్పష్టంగా చెబుతున్నారు. అందుకే అమెరికన్లు వివిధ రకాల షోరూంలకు క్యూ కడుతున్నారు. రాబోయే రోజుల్లో ధరలు పెరిగే అవకాశం ఉన్నందున జీన్స్, స్పోర్ట్స్ వేర్, వర్క్ వేర్, క్యాజువల్ షూలను కూడా ముందుగానే కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో కాఫీ, స్నాక్స్, సాస్‌లు, అంతర్జాతీయ కిరాణా వస్తువులు  కూడా జోరుగా విక్రయమవుతున్నాయి. బ్లెండర్లు, ఎయిర్ ఫ్రైయర్లు, మసాజ్ కుర్చీలు, ట్రెడ్‌మిల్స్ కూడా  విరివిగా అమ్ముడవుతున్నాయి. 

ఇది కూడా చదవండి: Sri Rama Navami: బెంగాల్‌ నుంచి ముంబై వరకూ.. హై అలర్ట్‌
 

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)