Breaking News

‘రెడ్‌బుక్‌’ ఎఫెక్ట్‌..! కాష్‌పటేల్‌కు సెనేట్‌ షాక్‌

Published on Sun, 02/09/2025 - 18:35

వాషింగ్టన్‌:అమెరికాలోనూ కక్ష సాధింపు రాజకీయాల కాలం నడుస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఉన్నట్లుగానే అక్కడా రిపబ్లికన్లు ఒక ‘రెడ్‌బుక్‌’ రాసి పెట్టుకున్నారు. అందులో వారు టార్గెట్‌గా చేసుకున్న ప్రత్యర్థుల పేర్లు రాసుకున్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరెవరిపై ఎలా కక్ష తీర్చుకోవాలనేది ముందే డిసైడయ్యారు. 

ఈ కక్ష సాధించే సంప్రదాయమే ట్రంప్‌ 2.0లో ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ) చీఫ్‌గా నామినేట్‌ అయిన కాశ్‌పటేల్‌ మెడకు చుట్టుకుంది. తాము కక్ష తీర్చుకోవాల్సిన డెమోక్రాట్లు చాలా మంది ఉన్నారని కాష్‌ పటేల్‌ గతంలో వ్యాఖ్యానించారు. కాష్‌ మాట్లాడిన ఈ మాటలే ప్రస్తుతం ఆయన ఎఫ్‌బీఐ చీఫ్‌గా పదవి చేపట్టేందుకు అడ్డంకిగా మారింది.

ఈ మాటల వల్లే కాష్‌ పటేల్‌ నామినేషన్‌ను గత వారం అమెరికా ఎగువ సభ సెనేట్‌ ఆమోదించలేదు. కాష్‌ను ఎఫ్‌బీఐ చీఫ్‌గా నియమించడాన్ని డెమోక్రాట్‌ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. కక్ష సాధింపు రాజకీయాలు చేస్తానన్న కాష్‌ను ఎఫ్‌బీఐ చీఫ్‌గా నియమిస్తే అది రాజకీయ నియామకమే అవుతుందని వారు పేర్కొన్నారు.

కాష్‌ పటేల్‌ రెడ్‌బుక్‌లో పలువురు డెమోక్రాట్‌ నేతలతో పాటు ట్రంప్‌ కేసులు వాదించిన ప్రాసిక్యూటర్లు, బైడెన్‌ హయాంలో కీలక బాధ్యతల్లో ఉన్న అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. భారత సంతతికి చెందిన కాష్‌ను ఎఫ్‌బీఐ చీఫ్‌గా ట్రంప్‌ గతేడాది అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన వెంటనే నామినేట్‌ చేయడం గమనార్హం.
 

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)