Breaking News

చైనాను అడ్డుకోవడానికి భారత్‌ మద్దతు కావాలి: స్కాట్‌ బెసెంట్‌

Published on Wed, 10/15/2025 - 08:45

వాషింగ్టన్‌: అమెరికా, చైనా(China) మధ్య టారిఫ్‌ల కారణంగా ట్రేడ్‌ వార్‌ కొనసాగుతోంది. అరుదైన ఖనిజాలపై చైనా ఆధిపత్యం విషయంలో అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో చైనాకు వ్యతిరేకంగా భారత్ మద్దతు ఇవ్వాలని ఆశిస్తున్నట్లు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్‌(Scott Bessent) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో చైనాను టార్గెట్‌ చేసి.. ప్రపంచ పంపిణీ వ్యవస్థలపై చైనా గురిపెట్టిందని ఆరోపణలు గుప్పించారు.

అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్‌ తాజాగా ఫాక్స్‌ న్యూస్‌ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘అ‍మెరికా ప్రపంచ శాంతి, ఆర్థిక స్థిరత్వం కోసం కృషి చేస్తోంది. ఇదే సమయంలో చైనా ప్రపంచంలో వార్ ఎకానమీకి ఫైనాన్స్ చేస్తోందని ఆరోపించారు.  అరుదైన ఖనిజాల(rare Metals) ఉత్పత్తి, సరఫరాపై చైనా పెంచుకుంటున్న ఆధిపత్యాన్ని అడ్డుకోవడంలో భారత్, యూరోపియన్ దేశాలు అమెరికాతో కలిసి నడవాలని పిలుపునిచ్చారు. అయితే, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆధునిక సాంకేతిక పరికరాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, రక్షణ సామగ్రి తయారీలో ఈ ఖనిజాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. చైనా ఈ వనరులలో దాదాపు 70% సరఫరాను నియంత్రిస్తుండటంతో, అమెరికా దీనిని వ్యూహాత్మక ముప్పుగా చూస్తోంది. ఇక, అక్టోబర్‌ 9 నుంచి అరుదైన ఖనిజాల ఎగుమతులకు అనుమతులు తప్పనిసరి చేస్తూ చైనా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

అయితే.. ఆయన మాటల్లో స్పష్టంగా చైనాపై వ్యతిరేక ధోరణి కనిపించింది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు, సాంకేతిక పరమైన పోటీ, దక్షిణ చైనా సముద్రం వివాదం వంటి అంశాలు ఇప్పటికే ఉద్రిక్తతలను పెంచాయి. ఇప్పుడు అరుదైన ఖనిజాల విషయం కూడా ఆ వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి. అమెరికా ఈ వనరుల సరఫరాను చైనా నుండి స్వతంత్రంగా మార్చుకునే ప్రయత్నంలో ఉంది. భారత్ ఈ రంగంలో విస్తారమైన వనరులు కలిగి ఉండటంతో, అమెరికా వ్యూహాత్మకంగా భారత్ వైపు మొగ్గు చూపుతోంది.

మరోవైపు, అమెరికా ఇటీవల భారత్‌పై కొన్ని ఉత్పత్తులపై టారిఫ్‌లు విధించడం, వాణిజ్య పరమైన అడ్డంకులు సృష్టించడం విమర్శలకు దారితీసింది. టారిఫ్‌లతో భారత్ ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీస్తూనే, చైనాపై పోరులో మద్దతు కోరడం విరుద్ధ ధోరణిగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. అయినప్పటికీ, ఖనిజాల రంగంలో భారత్ భాగస్వామ్యం అమెరికాకు వ్యూహాత్మకంగా అవసరమని విశ్లేషకులు భావిస్తున్నారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)