Breaking News

హమాస్‌ మరో డేంజర్‌ ప్లాన్‌.. అమెరికా సీరియస్‌ వార్నింగ్‌

Published on Sun, 10/19/2025 - 12:21

వాషింగ్టన్‌: గాజాలోని పౌరులపై దాడులు చేసేందుకు హమాస్ (Hamas) ప్రణాళికలు రచిస్తోందని కలకలం రేపింది. హమాస్‌ దాడుల ప్రణాళిక గురించి తమ వద్ద విశ్వసనీయ సమాచారం ఉందని అమెరికా (USA) విదేశాంగ శాఖ తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది. దీంతో, రంగంలోకి దిగిన అమెరికా.. హమాస్‌కు హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి చర్యలకు దిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్‌ ఇచ్చింది.

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య సుదీర్ఘ యద్ధం జరిగిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చొరవతో ఇజ్రాయెల్‌- హమాస్‌ (Israel- Hamas)ల మధ్య ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా ఇజ్రాయెల్‌ బందీలను సైతం హమాస్‌ విడుదల చేసింది. అయితే, గాజాలోని పౌరులపై దాడులు చేసేందుకు హమాస్ ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం బయటకు రావడం తీవ్ర కలకలం రేపింది. ఈ సందర్బంగా అమెరికా (USA) విదేశాంగ శాఖ అలర్ట్‌ అయ్యింది. పాలస్తీనా పౌరులపై హమాస్ దాడి ప్రణాళిక.. కాల్పుల విరమణ ఒప్పందాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమేనని అమెరికా పేర్కొంది.

తమ మధ్యవర్తిత్వ ప్రయత్నాలతో సాధించిన గణనీయమైన పురోగతిని ఇది దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. హమాస్ ఈ దాడులకు పాల్పడితే.. గాజా ప్రజలను రక్షించడానికి, కాల్పుల విరమణ సమగ్రతను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తమకు అందిన ఈ సమాచారాన్ని ఈజిప్టు, ఖతార్‌, తుర్కియేతో సహా శాంతి ఒప్పందానికి హామీగా ఉన్న దేశాలకు తెలియజేసినట్లు యూఎస్ తెలిపింది. దీంతో, మరోసారి గాజాలో ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయా అని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)