Breaking News

విదేశీయులకు ట్రంప్‌ మరో బిగ్‌ షాక్‌

Published on Wed, 07/02/2025 - 19:25

వాషింగ్టన్‌:  విదేశీయులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ షాకిచ్చారు. విద్యార్ధులు,విజిటర్ల వీసాలపై నిర్ధిష్ట సమయాన్ని విధించనున్నారు. ఆ గడువు పూర్తయిన విద్యార్థులు, విజిటర్లు వారి వీసాల్ని రెన్యువల్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. రెన్యువల్‌ కాకపోతే దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. దీంతో  డ్యూరేషన్‌ ఆఫ్‌ స్టేటస్‌ విధానంపై ట్రంప్‌ తీసుకున్న నిర్ణయంతో అమెరికాలో విదేశీయులపై ఆంక్షల కత్తి వేలాడుతున్నట్లైందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.    

దేశంలో అక్రమ వలస దారులు అరికట్టేలా అమెరికా డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. విదేశీ విద్యార్థులు, టూరిస్టులు దేశంలో ఉండే సమయాన్ని నిర్ధేశించనుంది. ఆ సమయం గడువు దాటిన తర్వాత దేశంలో ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా కొత్త వీసా ప్రతిపాదనలు తెచ్చింది.

ఇప్పటి వరకు ఉన్న డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ విధానాన్ని రద్దు చేసి, ప్రతి వీసాకు నిర్దిష్ట గడువు విధించాలని ట్రంప్ సర్కారు భావిస్తోంది. ప్రస్తుతం F-1 (విద్యార్థులు), J-1 (ఎక్స్చేంజ్ విజిటర్లు) వీసాలపై ఉన్నవారు తమ విద్యను కొనసాగిస్తున్నంత వరకు అమెరికాలో ఉండే హక్కు ఉంది. కొత్త ప్రతిపాదన అమలైతే, వారు పూర్తిగా గడువు ముగిసేలోపు దేశాన్ని విడిచి వెళ్లాలి లేదా వీసా పొడిగింపు కోసం దరఖాస్తు చేయాలి.

త్వరలోనే అమలు
ప్రస్తుతం ట్రంప్‌ ప్రభుత్వ ప్రతిపాదనను హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ సిద్ధం చేసి, ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్ (OMB) సమీక్షకు పంపింది. ప్రజల అభిప్రాయాల కోసం 30–60 రోజుల గడువు ఇవ్వవచ్చని తెలుస్తోంది. ఆ తరువాత ఈ కొత్త వీసా రూల్స్‌ అమల్లోకి రానున్నాయి. 

విదేశీ విద్యార్థులపై ట్రంప్ చర్యలు:
ట్రంప్ పాలనలో అక్రమ వలసదారుల తొలగింపు, యూనివర్సిటీలపై నియంత్రణ పెరిగింది. హార్వర్డ్ యూనివర్సిటీపై 2.2 బిలియన్ డాలర్ల ఫెడరల్ ఫండింగ్‌ను నిలిపివేశారు. ట్రంప్ విధించిన షరతులను హార్వర్డ్ తిరస్కరించడంతో విదేశీ విద్యార్థులకు ప్రవేశాన్ని నిషేధించారు. అయితే, ఇటీవల ఓ ఫెడరల్ న్యాయమూర్తి ఈ నిర్ణయాన్ని నిలిపివేశారు. అయినప్పటికీ విదేశీయులపై ట్రంప్‌ మరిన్ని కఠిన ఆంక్షలు విధించేలా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా డ్యూరేషన్‌ ఆఫ్‌ స్టేటస్‌ విధానంపై దృష్టిసారించినట్లు సమాచారం.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)