Breaking News

ఐరాసలో సంస్కరణలకు మద్దతు ఇస్తాం: అమెరికా

Published on Thu, 04/18/2024 - 09:06

న్యూయార్క్‌: ఐక్యరాజ్యసమితి, దాని అనుబంధ సంస్థల్లో సంస్కరణలకు తాము పూర్తి మద్దతు ఇస్తామని అమెరికా వెల్లడించింది. ఐరాస, ఐరాస భద్రతా మండలిలో సంస్కరణలు చేయడాని అమెరికా మద్దతు ఇస్తుందని అగ్రరాజ్య విదేశాంగ శాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ పేర్కొన్నారు.  బుధవారం మీడియాతో వేదాంత్ పటేల్ మాట్లాడారు. ఇటీవల ఐరాస, దాని అనుబంధ సంస్థల్లో మార్పులు అవసరమన్న టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ ప్రస్తావనకు సంబంధించి రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు వేదాంత్‌ పటేల్‌ సమాధానం ఇచ్చారు.

‘ఇప్పటికే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అమెరికా అధ్యక్షడు ఈ విషయం గురించి మాట్లాడారు. అదేవిధంగా ఐరాస​ కార్యదర్శి సైతం ఈ విషయాన్ని ప్రస్తావించారు.  మనం ప్రస్తుతం 21 శతాబ్దంలో ఉన్నాం. దానిని ప్రతిబింబించేలా ఐరాసతో పాటు దాని అనుబంధ సంస్థల్లో తప్పకుండా మార్పులు అవసరం.  ఐరాస సంస్కరణలకు తాము(అమెరికా) కచ్చితంగా మద్దతు ఇస్తాం. అయితే ఎలాంటి  సంస్కరణలు చేయాలో అనే ప్రత్యేకమైన సూచనల తమ వద్ద లేవు. కానీ, ఐరాసలో మార్పులు అవసరమని మేం కూడా గుర్తించాం’ అని వేదాంత్‌ పటేల్‌ స్పష్టం చేశారు.

ఇక... జనవరిలో ఐక్యరాజ్యసమితి పనితీరుపై టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌.. ఐరాస, దాని అనుబంధ సంస్థల్లో మార్పులు అవసరమన్న విషయం తెలిసిందే. భద్రతా మండలిలో భారత్‌ వంటి దేశానికి శాశ్వత సభ్యత్వం లేకపోవడాన్ని ఎలాన్‌ మస్క్‌ తప్పుబట్టారు. అదీకాక.. శక్తిమంతమైన దేశాలు తమ సభ్యత్వాన్ని వదులుకోలేక పోతున్నాయంటూ విమర్శలు గుప్పించారు.

‘ఐరాస, దాని అనుబంధ సంస్థలను సవరించాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్‌కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేకపోవడం హాస్యాస్పదం. శక్తిమంతమైన దేశాలు తమ స్థానాలను వదులుకునేందుకు ఇష్టపడకపోవడమే అసలు సమస్య. ఆఫ్రికా యూనియన్‌కు సమష్టిగా ఒక శాశ్వత సభ్యత్వం ఇవ్వాలి’ అని ఆయన ఎక్స్‌ వేదికగా స్పందించిన విషయం తెలిసిందే.

ఇక.. ప్రపంచ శాంతి స్థాపనే లక్ష్యంగా 1945లో ఐక్యరాజ్యసమితి స్థాపించారు. ఐరాసకు అనుబంధంగా భద్రతా మండలి ఏర్పడి ఏడున్నర దశాబ్దాలు దాటిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు భద్రతా మండలిలో ఎటువంటి మార్పులూ చోటుచేసుకోకపోవటం గమనార్హం. అయితే శక్తివంతమైన వీటో అధికారం కలిగిన శాశ్వత సభ్యదేశాలుగా అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌లే కొనసాగుతున్నాయి. శాశ్వత సభ్యత్వం కోసం ఇండియా పట్టుబడుతున్నా దక్కటం లేదు. ఐదింట నాలుగు దేశాలు భారత్‌కు అనుకూలంగానే ఉన్నప్పటికీ  పొరుగుదేశం చైనా అడ్దుకుంటోంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)