Breaking News

తొలిసారి డొనాల్డ్‌ ట్రంప్‌తో మామ్దానీ భేటీ..!

Published on Fri, 11/21/2025 - 21:44

అమెరికాలో పెద్ద నగరమైన న్యూ యార్క్‌ మేయర్‌గా ఎన్నికైన డెమొక్రటిక్‌ సోషలిస్ట్, భారతీయ అమెరికన్‌ యువకుడు జొహ్రాన్‌ మమ్దాని..   ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను కలవనున్నారు. ఈరోజు(శుక్రవారం) డొనాల్డ్‌ ట్రంప్‌తో వైట్‌హౌస్‌లో భేటీ కానున్నారు మామ్దాని.  

అయితే న్యూయార్క్‌ మేయర్‌గా మామ్దాని ఎన్నిక కావడానికి ముందు, ఆ తర్వాత ఆయనపై ట్రంప్‌ తీవ్ర విమర్శలు చేశారు.  అతనొక కమ్యూనిస్టు అని ఒకవైపు,  అతడి పేరు ఎదైనా కావొచ్చు, అతడు ఎవరైతే నాకేంటి? అని హేళన కూడా మాట్లాడారు. 

అమెరికా ప్రజలు కమ్యూనిజం కావాలో లేక కామన్‌సెన్స్‌ కావాలో తేల్చుకొనే సమయం వచ్చిందని అన్నారు. ఇలా సమయం వచ్చినప్పుడల్లా మామ్దానీపై విరుచుకుపడుతూనే ఉన్నారు ట్రంప్‌. న్యూయార్క్‌ అభివృద్ధికి సంబంధించి నిధులు ఆపేస్తున్నారని మామ్దానీ సైతం ఆరోపించారు. ఈ నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరువురు వైట్‌హౌస్‌లో ముఖాముఖి ఎదురపడటం ఇదే తొలిసారి.  ఏయే అంశాలు ప్రస్తావనకు వస్తాయి. దానికి ట్రంప్‌ ఎలా రియాక్ట్‌ అవుతారు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. 

మామ్దానీ వైట్‌హౌస్‌కి వస్తున్న వేళ కూడా సెటైర్లు పడ్డాయి. వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కరోలైన్‌ లీవిత్‌.. వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అమెరికాలో పెద్ద నగరమైన న్యూయార్క్‌కు మేయర్‌గా ఎన్నికైన కమ్యూనిస్టు మామ్దానీ వైట్‌హౌస్‌కు వస్తున్నారంటూ సెటైర్ల వేశారు. తమ అధ్యక్షుడు డొనాల్డ్‌  ట్రంప్‌ ప్రతీ ఒక్కరితోనూ మాట్లాడాతారంటూ చెప్పుకొచ్చారు.  అమెరికా ప్రజల ప్రయోజనాల కోసం ట్రంప్‌ ఎవరితోనైనా మాట్లాడతారంటూ మామ్దానీని తక్కువగా చేసి వ్యాఖ్యలు చేశారు.

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)