కవిత లేఖ ఓ డ్రామా: బండి సంజయ్
Breaking News
పెళ్లైన కొద్ది గంటలకే చనిపోయిన సింగర్.. షాక్‌లో ఫ్యాన్స్..
Published on Wed, 11/30/2022 - 13:17
వాషింగ్టన్: పెళ్లి చేసుకుని ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్న ప్రముఖ సింగర్ హఠాణ్మరణం చెందాడు. ఘనంగా విహవాం జరిగిన కొన్ని గంటలకే నిద్రలోనే తుది శ్వాస విడిచాడు. దీంతో ఆయన భార్యతో పాటు అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
37 ఏళ్ల వయసులోనే చనిపోయిన ఈ సింగర్ పేరు జేక్ ఫ్లింట్. అమెరికా ఓక్లామాలో 1985లో జన్మించాడు. స్థానికంగా ఫేమస్. బ్రెండ్ విల్సన్‌ను శనివారం పెళ్లిచేసుకున్నాడు. ఎంతో ఘనంగా ఈ వేడుక జరిగింది. అయితే ఆ తర్వాత కొన్ని గంటలకే జేక్ మరణించాడు. ఆయన మృతికి గల కారణాలు మాత్రం తెలియడం లేదు.
జేక్ మృతిని అతని స్నేహితుడు ప్రచారకర్త క్లిఫ్ డోయల్ వెల్లడించాడు. దీంతో సోషల్ మీడియాలో అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జేక్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేస్తున్నారు.
వాట్స్ యువర్ నేమ్, లాంగ్ రోడ్ బ్యాక్ హోం, కౌ టౌన్, ఫైర్ లైన్ వంటి హిట్ ఆల్బమ్స్‌తో జేక్ అమెరికాలో పాప్ సింగర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇతని మొదటి ఆల్బమ్ అయామ్ నాట్ ఓకే 2016లో రిలీజ్ అయింది. ఆ తర్వాత వరుసగా చాలా ఆల్బమ్స్‌తో మ్యూజిక్ ప్రియులను అలరించాడు. లైవ్ ఈవెంట్స్ చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు.
#RIP Jake Flint https://t.co/IRs55HiCHi pic.twitter.com/dyPfbx6fvH
— Joshua Claussen (@StormyClaussen) November 28, 2022
చదవండి: పసిప్రాయంలో కిడ్నాప్.. 51 ఏళ్ల తర్వాత..
Tags : 1