Breaking News

అమెరికా–పాక్‌  రక్షణ బంధం బలోపేతం!

Published on Fri, 07/04/2025 - 00:53

వాషింగ్టన్‌: అమెరికా–పాకిస్తాన్‌ మధ్య రక్షణ బంధం క్రమంగా బలోపేతం అవుతోంది. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారత సైన్యం చేపట్టిన అపరేషన్‌ సిందూర్‌లో భారీగా నష్టపోయిన పాక్‌ సైన్యం అమెరికాకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా పాకిస్తాన్‌ ఎయిర్‌ఫోర్స్‌(పీఏఎఫ్‌) చీఫ్, ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ జహీర్‌ అహ్మద్‌ బాబర్‌ సిద్ధూ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఇదొక ఉన్నత స్థాయి పర్యటన. 

పాకిస్తాన్‌ వైమానిక దళం అధినేత అమెరికాలో అధికారికంగా పర్యటిస్తుండడం గత పదేళ్లలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. పాక్‌ ఆర్మీ చీఫ్‌ ఫీల్డ్‌ మార్షల్‌ అసిమ్‌ మునీర్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వైట్‌హౌస్‌లో ఇటీవల ఘనమైన ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. అమెరికాలో పర్యటనలో భాగంగా జహీర్‌ అహ్మద్‌ బాబర్‌ సిద్ధూ అమెరికా అత్యున్నత సైనికాధికారులతో, ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. 

యూఎస్‌ ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ జనరల్‌ డేవిడ్‌ అల్విన్‌ను కలుసుకున్నారు. విస్తృతంగా చర్చలు జరిపారు. అమెరికాతో రక్షణ సహకారం పెంపొందించుకోవడం, కలిసి పనిచేయడం, టెక్నాలజీ ఆధారిత సైనిక మారి్పడి వంటి అంశాలపై చర్చించినట్లు సమాచారం. జహీర్‌ అహ్మద్‌ బాబర్‌ సిద్ధూ పర్యటనతో అమెరికా–పాక్‌ మధ్య ద్వైపాక్షిక రక్షణ సహకారం, పరస్పర ప్రయోజనాలు మరింత వృద్ధి చెందుతాయని ఆశిస్తున్నట్లు పాకిస్తాన్‌ వైమానిక దళం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇరుదేశాల సంబంధాల్లో ఇదొక కీలక మైలురాయి అని అభివరి్ణంచింది. 

 తమ వైమానిక దళాన్ని ఆధునీకరించాలని పాకిస్తాన్‌ నిర్ణయానికొచ్చింది. ఇందుకోసం అమెరికా సాయాన్ని అర్థిస్తోంది. అమెరికా నుంచి 70 ఎఫ్‌–16 బ్లాక్‌ ఫైటర్‌జెట్లు, గగనతల రక్షణ వ్యవస్థలు, ఏఐఎం–7 స్పారో ఎయిర్‌–టు–ఎయిర్‌ మిస్సైళ్లు, ఆర్టిలరీ రాకెట్‌ సిస్టమ్‌ బ్యాటరీలు సమకూర్చుకోవాలని భావిస్తోంది. చైనా ఇచ్చిన ఆయుధాలపై ఆధారపడడం క్షేమంకాదని ఆపరేషన్‌ సిందూర్‌తో పాకిస్తాన్‌కు తెలిసొచ్చింది. అందుకే అమెరికా ఆయుధాలపై దృష్టి పెట్టింది. అందుకు అమెరికా సైతం సానుకూలంగా స్పందిస్తుండడం చర్చనీయాంశంగా మారతోంది.   
 

Videos

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడం కూటమి పిరికి చర్య..

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Russia Ukraine War : పుతిన్ ఆఫర్..యుద్ధం ముగిసేనా..?

స్టాక్ మార్కెట్ లో కోట్లు, మోహ్నిష్ పాబ్రాయ్ షాకింగ్ స్టాటజీ

లోకేష్ రాజీనామా చేయాలి

అర్హులకు అన్యాయం.. నకిలీలకు ఉద్యోగాలా?

ఎమ్మెల్యే కూన రవి సంతకాలు చేసిన వారికే టీచర్ ఉద్యోగాలు

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు