Breaking News

‘పరిస్థితులు ఎలా ఉన్నా..’.. సుంకాలపై అమెరికా ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు

Published on Thu, 08/28/2025 - 08:23

న్యూఢిల్లీ: భారతదేశం పై అమెరికా 50 శాతం సుంకాలు అమలు చేయడంపై  ఇండియాలోని వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రష్యా చమురు కొనుగోలు నేపథ్యంలో భారత్‌పై అమెరికా అదనపు సుంకాలు విధించింది. తాజాగా అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ఈ సుంకాల విషయమై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం ఇంకా పూర్తి కాలేదని, పరిస్థితులు ఎలా ఉన్నా, తాము కలిసే పనిచేస్తామని పేర్కొన్నారు. సుంకాల అంశాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని స్కాట్ బెసెంట్ పేర్కొన్నారు.

భారత్‌పై విధించిన 50 శాతం సుంకాలను అమెరికా బుధవారం (ఆగస్టు 27) నుంచి వీటిని అమలు చేస్తోంది. రష్యా నుంచి ఇకపై ముడి చమురు కొనుగోలు చేయవద్దని అమెరికా భారత్‌కు సూచించింది. అయితే భారత్.. అమెరికా మాటను లెక్క చేయలేదు. దీంతో అమెరికా అదనపు సుంకాలతో బెదిరింపులకు దిగింది. సుంకాలు అమలవుతున్న సమయంలో అమెరికా ఆర్థిక మంత్రి సామరస్య పూర్వక వ్యాఖ్యలు చేశారు.

అమెరికా విధించిన  అదనపు సుంకాల కారణంగా భారత్‌లోని పలు కంపెనీలు మూతపడతాయని, లక్షల మంది ఉపాధి కోల్పోతారనే వాదన వినిపిస్తోంది. తాజాగా అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ .. పరిస్థితులు ఎలా ఉన్నా సరే అమెరికా, ఇండియా చివరకు కలిసి పని చేస్తాయని పేర్కొనడం గమనార్హం. బెసెంట్ ఓ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అమెరికా, భారత్ మధ్య ఇంకా వాణిజ్య ఒప్పందం పూర్తి కాలేదన్నారు. ఇండియా ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైతే.. అమెరికా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశమన్నారు. ఈ రెండు దేశాల మధ్య పరిస్థితులు ఎలా ఉన్నా చివరకు అమెరికా, ఇండియా కలిసి పని చేస్తాయని స్పష్టం చేశారు.

అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోదీ మధ్య ఉన్నత స్థాయి సంబంధాలన్నాయని, అమెరికా విధించిన సుంకాల మీద చర్చలు జరిపేందుకు భారత్ వెంటనే ముందుకు వచ్చిందని గుర్తు చేశారు. అయినా ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదరలేదని, మే, జూన్ నాటికి  ఇరు దేశాలు ఓ అభిప్రాయానికి వస్తాయని భావించామన్నారు. అయితే డీల్‌ ఇంకా పూర్తి కాలేదన్నారు. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేయడం కారణంగా ఇండియా లాభాలు ఆర్జిస్తున్నదన్నారు. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ కనిష్ఠ స్థాయికి పడిపోయిందన్నారు. త్వరలోనే సుంకాల అంశంపై ఒక పరిష్కారం వచ్చే అవకాశం ఉందన్నారు.

#

Tags : 1

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)