Breaking News

ఇరాన్‌లో భారీ పేలుళ్లు.. ఇజ్రాయెల్‌ పనేనన్న అమెరికా!

Published on Fri, 04/19/2024 - 11:21

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్‌ చేసిన డ్రోన్‌, మిసైల్‌ దాడులకు ఇజ్రాయెల్‌ ప్రతీకార దాడులకు పాల్పడినట్టు అమెరికా అధికారులు వెల్లడించారు. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్‌లోని ఇస్ఫాహాన్ నగరంలో భారీ పేలుళ్లు సంభవించాయని అమెరికా పేర్కొంది. ఇరాన్‌పై మిసైల్‌ ఇజ్రాయెల్‌ దాడి చేసినట్లు అమెరికా అధికాలు తెలిపారు. అయితే దీనిపై ఇరాన్‌ స్పందిస్తూ.. తమ భూభాగంలో ఇప్పటి వరకు ఎలాంటి మిసైల్‌ దాడి జరగలేదని తెలిపింది. అదే సమయంలో కొన్ని డ్రోన్లను కూల్చివేసినట్లు స్పష్టం చేసింది.

ఇరాన్‌ రాజధాని నగరం టెహ్రాన్‌కు సుమారు 350 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఇస్ఫాహాన్ నగరంలోని అతిపెద్ద మిలిటరీ ఎయిర్‌ బేస్‌, పలు ఇరాన్ న్యూక్లీయర్‌ సైట్లు ఉన్నాయి. వీటిని లక్ష్యంగా చేసుకుని మిసైల్‌ దాడి జరిగినట్లు అమెరికా మీడియా తెలిపింది.

ఈ దాడులను ఇరాన్‌ కొట్టేసింది. అదే సమయంలో ఇజ్రాయెల్ కూడా ఈ దాడుల గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. దాడుల నేపథ్యంలో ఇరాన్‌లో పలు విమానాల రాకపోకలను రద్దు చేసినట్లు తెలుస్తోంది. ‘ఇరాన్‌ రక్షణ వ్యవస్థ పలు డ్రోన్లను  విజయవంతంగా కూల్చివేసింది. ప్రస్తుతానికి ఎటువంటి క్షిపణీ దాడి జరిగినట్లు నివేదికలు లేవు’ అని ఇరాన్ ప్రతినిధి హుస్సేన్‌ దాలిరియన్ ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. 

ఇస్ఫాహాన్ సమీపంలోని ప్రధాన వైమానిక స్థావరం సమీపంలో పేలుళ్ల శబ్దం వినిపించినట్టు మరికొందరు తెలిపారు. అయితే కీలకమైన ఎయిర్‌ బేస్‌ సైట్‌లను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్‌ కొన్ని డ్రోన్‌లను ప్రయోగించి ఉండవచ్చని ఇరాన్ ప్రభుత్వ అధికారి తెలిపారు.

ఇటీవల ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ డ్రోన్‌, మిసైల్‌ దాడులకు పాల్పడినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి  ఇరాన్‌పై ప్రతీకార దాడి చేస్తామని హెచ్చరిస్తూ వచ్చింది. తాజా దాడులతో పశ్చిమాసియా మరింత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఒక వేళ యుద్ధం అంటూ ప్రారంభమయితే అది ఇరాన్‌ - ఇజ్రాయెల్‌ మధ్య ఆగదని.. ఇతర దేశాలకూ వ్యాపిస్తుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)