అమెరికాలో కాల్పుల కలకలం.. మాజీ భార్య, కాబోయే భార్యపై కూడా!

Published on Sat, 02/18/2023 - 09:28

వాషింగ్టన్‌: అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. మిసిసిప్పీ రాష్ట్రంలో శుక్రవారం మూడు వేర్వేరు చోట్ల జరిగిన కాల్పుల ఘటనల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ మూడు చోట్ల కాల్పులకు పాల్పడింది ఒక్కడే అని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడ్ని ఇప్పటికే అరెస్టు చేసి విచారిస్తున్నారు. అర్కబుట్ల, టాటె కౌంటీల్లోని ఓ స్టోర్, రెండు ఇళ్లలో కాల్పులు జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడ్ని రిచర్ డేల్ క్రమ్(52)గా గుర్తించారు.

అయితే ఇతడు మొదట  తన మాజీ భార్య, ఇతర కుటుంబసభ్యులపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత తనకు కాబోయే భార్యను కాల్చి చంపినట్లు సమాచారం. అంతకుముందే ఓ స్టోర్‌లోనూ తుపాకీతో దాడి చేశాడు. ఈ ఘటనల్లో మొత్తం ఆరుగురు చనిపోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అతడు ఎందుకు ఈ  దాడులు చేశాడో ఇంకా తెలియదని పోలీసులు చెప్పారు. అతడ్ని విచారించాక పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు.

అర్కబుట్లలో నిందితుడు ఓ ఇంట్లోకి వెళ్లి కాల్పులు జరపడం పొరిగింటి మహిళ ప్రత్యక్షంగా చూసింది. అతి తక్కువ మంది నివసించే ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడం పట్ల తీవ్ర భయాందోళన వ్యక్తం చేసింది. నిందితుడు లోపలికి వెళ్లాక కాల్పుల శబ్దం వినిపించిందని, తాను బయటకు చూసే సరికి అతడు తుపాకీతో నడుచుకుంటూ వెళ్తున్నాడని వివరించింది. కాల్పులు జరిగిన ఇంట్లోకి వెళ్లి చూస్తే ఓ వ్యక్తి బుల్లెట్‌ గాయాలతో చనిపోయి ఉన్నట్లు వివరించింది.
చదవండి: 75 ఏళ్లు దాటితే యోగ్యతా పరీక్షలు పెట్టాలి: నిక్కీ హేలీ

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)