Breaking News

పాక్‌ మాకు మిత్రుడే.. భారత్‌తో బంధం వదులుకోలేం: మార్కో రుబియో

Published on Mon, 10/27/2025 - 07:48

వాషింగ్టన్‌: భారత్‌, పాకిస్తాన్‌ విషయంలో అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రుబియో కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్‌తో వ్యూహాత్మక సంబంధాల విస్తరిస్తున్న సమయంలో భారత్‌ను దూరం చేసుకోలేమని చెప్పుకొచ్చారు. భారత్‌తో ఉన్న చారిత్రాత్మక, బలమైన, ముఖ్యమైన సంబంధాలను పణంగా పెట్టబోమని తెలిపారు.

మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌తో మార్కో రుబియో ఈరోజు భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘పాక్‌తో అమెరికా సంబంధాలపై కొన్ని కారణాల రీత్యా భారత్‌కు ఆందోళనలు ఉన్నాయి. వేర్వేరు దేశాలతో మాకు సంబంధాలు ఉండాలనేది భారత్‌ అర్థం చేసుకోవాలి. ఎన్నడూ భారత్‌తో బంధాలను మేం వదులుకోబోమని క్లారిటీ ఇచ్చారు.

ఇదే సమయంలో పాక్‌తో వ్యూహాత్మక సంబంధాల విస్తరణలో మాకు అవకాశాలు కనిపిస్తున్నాయి. దౌత్యం, దానితో ముడిపడిన అంశాల వరకు భారతీయులు ఎంతో పరిపక్వతతో ఉంటారనే నేను భావిస్తున్నాను. ఎందుకంటే మాతో సంబంధాల్లేని కొన్ని దేశాలతో భారత్‌కు అనుబంధం ఉంది. అందువల్ల ఇదంతా పరిపక్వతతో కూడిన, ఆచరణీయ విదేశాంగ విధానం’ అని చెప్పుకొచ్చారు. అలాగే, రష్యాతో చమురు కొనుగోళ్ల సంబంధాలను మళ్లించుకునేందుకు భారత్‌ ఇప్పటికే సంసిద్ధత వ్యక్తంచేసిందని చెప్పారు.

ఇదిలా ఉండగా.. మలేషియా వేదికగా ఆసియన్‌ సదస్సు జరుగుతోంది. ఆసియాన్‌ దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకునేందుకు ట్రంప్‌.. మలేషియా పర్యటనకు వచ్చారు. ఈ సమావేశంలో భారత ప్రధాని మోదీ వర్చువల్‌ విధానంలో ప్రసంగించనున్నారు. ఆసియాన్‌ సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, జపాన్‌ కొత్త ప్రధాని తకాయిచి, దక్షిణ కొరియా నేతలు కూడా పాల్గొననున్నారు.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)