Breaking News

ఇరాన్‌పై అమెరికా రహస్య దాడులు.. ఎన్నికలయ్యాక తీవ్రతరం?

Published on Tue, 11/03/2026 - 08:13

వాషింగ్టన్‌: పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇరాన్‌లోని కీలకమైన ఖేష్మ్ ద్వీపంపై అమెరికా రహస్యంగా దాడులు జరిపినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. అమెరికా అధికారులు అందించిన సమాచారాన్ని ఉదహరిస్తూ ఈ కథనాన్ని ప్రచురించింది. హార్ముజ్ జలసంధిలో ఉన్న ఈ ద్వీపంపై దాడుల నేపథ్యంలో వరుస పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థ ఐఆర్ఎన్ఏ తెలిపింది. ఇటీవలి  కాలంలో అమెరికా చేపట్టిన పరిమిత సైనిక చర్యల్లో భాగంగానే ఈ దాడులు జరిగినట్లు సమాచారం. ఇరాన్‌పై పూర్తిస్థాయి సైనిక చర్యలను తిరిగి ప్రారంభిస్తున్న సంకేతాలు వెళ్లకుండా వీటిని రహస్యంగా నిర్వహించినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.

మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఇరాన్‌పై మళ్లీ దాడులు చేయాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కోరుతున్నట్లు ఆక్సియోస్ వెల్లడించింది. అమెరికా మధ్యంతర ఎన్నికలు ముగిసిన తర్వాత సైనిక చర్యలు చేపట్టాలని ఆయన సూచించినట్లు తెలిపింది. అయితే, ప్రస్తుతానికి దౌత్యపరమైన చర్చలకు అవకాశం ఇవ్వాలని ట్రంప్ భావిస్తున్నట్లు సమాచారం.

శనివారం ట్రంప్, నెతన్యాహు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఇరాన్‌తో చర్చలు, సైనిక చర్యల పునఃప్రారంభంపై వీరిద్దరూ చర్చించినట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉండగా, ఇరాన్‌పై మళ్లీ దాడులు చేసే ఆలోచన ఉందా అని సోమవారం మీడియా ప్రశ్నించగా ట్రంప్ ‘లేదు’ అని సమాధానమిచ్చారు. మరోవైపు, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ఇరాన్‌తో చర్చల ద్వారా ఒప్పందం కుదిరే అవకాశాలపై ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన పరిష్కారం కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు.

ఇదీ చదవండి: విమాన ప్రమాదం.. ప్రముఖ వ్యాపారవేత్త కుటుంబం మృతి!

#

Tags : 1

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)