Breaking News

ఇరాన్‌పై మరోసారి అమెరికా దాడులు

Published on Wed, 07/08/2026 - 06:36

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్‌పై అమెరికా మరోసారి వైమానిక దాడులతో విరుచుకుపడింది. హర్మూజ్‌ జలసంధిలో మూడు వాణిజ్య నౌకలపై దాడులు జరిగిన కొన్ని గంటల్లోనే ఇరాన్‌ సైనిక స్థావరాలు, నౌకాశ్రయాల మౌలిక సదుపాయాలపై దాడులు చేసింది. వాణిజ్య రవాణా నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినందుకు భారీ మూల్యం చెల్లించేలా ఈ చర్య తీసుకున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది.

ఇరాన్‌ ముడిచమురు విక్రయాల లైసెన్స్‌ను కూడా అమెరికా రద్దు చేసేసింది. ఇరాన్‌ మిలిటరీ స్థావరాలు, పోర్టులపై దాడులు చేస్తామని అమెరికా హెచ్చరించింది. నౌకలపై దాడులు శాంతి ఒప్పందాని ఉల్లంఘించడమేని అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. 60 రోజుల్లో జరగాల్సిన శాంతి ఒప్పంద చర్చలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇరాన్ దురాక్రమణ సమర్థించలేనిది. ప్రమాదకరమైందని.. కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్పష్టంగా ఉల్లంఘించడమే అమెరికా సెంట్రల్ కమాండ్ పేర్కొంది. అమెరికా మీడియా సంస్థ 'అక్సియోస్' కథనం ప్రకారం.. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, తీరప్రాంత నిఘా వ్యవస్థలు, ఉపరితలం నుండి గగనతలానికి ప్రయోగించే క్షిపణులు, నౌకా వ్యతిరేక క్రూయిజ్ క్షిపణి కేంద్రాలు, డ్రోన్ లాంచ్ సైట్లు, ఓడరేవులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. బందర్ అబ్బాస్, సిరిక్ ఓడరేవు నగరాలు, కేశ్మ్ ద్వీపంలో పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ మీడియా తెలిపింది.

దీంతో తాజా దాడుల పరంపర గత నెలలో ఇరు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందాన్ని ప్రమాదంలో పడేసింది. ఒప్పంద నిబంధనలను ఉల్లంఘించాయని పరస్పరం అమెరికా, ఇరాన్ రెండు దేశాలూ ఆరోపించుకుంటున్నాయి. హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న మూడు ట్యాంకర్లపై క్షిపణి దాడులు జరిగిన కొన్ని గంటల్లోనే అమెరికా ఈ దాడులకు దిగింది.

ఈ దాడుల అనంతరం, ఇరాన్ చమురు విక్రయాలకు అనుమతించే లైసెన్స్‌ను అమెరికా రద్దు చేసింది. ఇరు దేశాల మధ్య పోరాటాన్ని ముగించడానికి ఉద్దేశించిన అవగాహనా ఒప్పందంలో ఈ లైసెన్స్ ఒక భాగం కావడం గమనార్హం. చమురు ఆంక్షల మినహాయింపును రద్దు చేయాలనే వాషింగ్టన్ నిర్ణయాన్ని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇది ఇస్లామాబాద్ అవగాహనా ఒప్పందంలోని ఆర్టికల్ 10ని స్పష్టంగా ఉల్లంఘించడమేనని పేర్కొంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)