Breaking News

ట్రంప్‌ పన్నుల బాంబు .. 60 దేశాలకు చుక్కలే?

Published on Fri, 07/24/2026 - 04:02

వాషింగ్టన్ డీసీ: డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రపంచానికి షాకిచ్చారు. ఉత్పత్తుల తయారీల వెట్టిచాకిరీ (ఫైర్డ్ లేబర్) అడ్డుకట్ట నిబంధనలను సరిగ్గా అమలు చేయడం లేదనే ఆరోపణలతో పన్నుల మోత మోగించారు. దాదాపు 60 భాగస్వామ్య దేశాలకు చెందిన వస్తువులపై దిగుమతి సుంకాలు పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు.

డొనాల్ట్‌ ట్రంప్ మరోసారి పన్నుల యుద్ధం ప్రకటించారు. గతంలో విధించిన  సుంకాల గడువు ముగుస్తుండడంతో వాటి స్థానంలో కొత్త సుంకాలను అమల్లోకి తెచ్చారు. ఈ నూతన పన్నులు 10 శాతం నుండి 12.5 శాతం వరకు ఉండనున్నాయి. ఈ పన్నులతో భారత్‌, చైనా, జపాన్, బ్రిటన్ యురోపియన్ యూనియన్ (EU) వంటి ప్రముఖ ఆర్థిక వ్యవస్థలపై ఈ  ప్రభావం పడనుంది.

ఈ విషయమై అమెరికా వాణిజ్య ప్రతినిధి  జామిసన్ గ్రీర్ మాట్లాడుతూ "అమెరికాలో దాదాపు ఒక శతాబ్దం నుంచి వెట్టిచాకిరీ ద్వారా తయారయ్యే వస్తువుల దిగుమతిపై నిషేధం ఉంది. దానిని మేము కఠినంగా అమలు చేస్తున్నాం. మన వాణిజ్య భాగస్వామ్య దేశాలు కూడా అదే పని చేయాల్సిన సమయం వచ్చింది." అని అన్నారు.

గత ఫిబ్రవరిలో ట్రంప్ విధించిన అనేక సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత ప్రత్యామ్నాయ అధికారాలను ఉపయోగించి 150 రోజుల పాటు విధించిన 10 శాతం తాత్కాలిక సుంకం గడువు తీరడంతో, 'ట్రేడ్ యాక్ట్ 1974 - సెక్షన్ 301' కింద నెలల తరబడి విచారణ జరిపి చట్టబద్ధంగా నిలిచేలా ఈ కొత్త సుంకాలను రూపొందించారు.
         ఏ దేశంపై ఎంత?

  • 10 శాతం సుంకం  వెట్టిచాకిరీపై కఠిన చట్టాలను అమలు చేస్తున్న కెనడా, బ్రిటన్, యురోపియన్ యూనియన్  వంటి దేశాలకు తక్కువ రేటైన 10% సుంకం వర్తిస్తుంది.

  •  12.5 శాతం సుంకం: వెట్టిచాకిరీ నిరోధంలో తగిన చర్యలు తీసుకోలేదని అమెరికా భావించిన చైనా, జపాన్ వంటి భాగస్వామ్య దేశాలపై 12.5% సుంకం పడనుంది.

  కాగా ఉక్కు, అల్యూమినియం వంటి ఇదివరకే ప్రత్యేక రక్షణ సుంకాలు ఉన్న రంగాలకు, అలాగే 'యుఎస్-మెక్సికో-కెనడా ఉచిత వాణిజ్య ఒప్పందం కింద అమెరికాలోకి వచ్చే వస్తువులకు ఈ కొత్త సుంకాల నుంచి మినహాయింపు లభించింది.

 

 

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)