Breaking News

అమెరికాకు తప్పిన షట్‌డౌన్‌ గండం

Published on Sun, 12/22/2024 - 05:16

వాషింగ్టన్‌:  అగ్రరాజ్యం అమెరికాకు షట్‌డౌన్‌ గండం తప్పింది. కీలకమైన ద్రవ్య వినిమయ బిల్లుపై అమెరికా కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభ చివరి నిమిషంలో ఆమోదముద్ర వేసింది. వాస్తవానికి శుక్రవారం రాత్రిలోగా బిల్లు ఆమోదం పొందకపోతే ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యేవి. అయితే, గడువుకు కొన్ని గంటల ముందు స్పీకర్‌ మైక్‌ జాన్సన్‌ ప్రవేశపెట్టిన కొత్త బిల్లుకు ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. అనంతరం ఈ బిల్లును సెనేట్‌కు పంపించారు. సెనేట్‌ సైతం ఆమోదించింది. దీంతో షట్‌డౌట్‌ గండం నుంచి అమెరికా తప్పించుకుంది. ఈ బిల్లును అధ్యక్షుడు జో బైడెన్‌కు పంపించారు.

ఆయన సంతకం చేస్తే బిల్లు చట్టరూపం దాల్చనుంది. జో బైడెన్‌ ప్రభుత్వం తీసుకొచి్చన ద్రవ్య వినిమయ బిల్లును కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గట్టిగా వ్యతిరేకించారు. దీంతో వచ్చే ఏడాది మార్చి 14 వరకు ప్రభుత్వ అవసరాలకు, విపత్తుల్లో సహాయక చర్యలకు నిధులు సమకూర్చేలా ప్రతినిధుల సభ స్పీకర్‌ మైక్‌ జాన్సన్‌ కొత్త బిల్లును ప్రవేశపెట్టారు. రుణాలపై సీలింగ్‌ను రెండేళ్లపాటు రద్దు చేయడం సహా ట్రంప్‌ లేవనెత్తిన పలు డిమాండ్లను ఇందులో చేర్చారు. గతంలో ట్రంప్‌ ప్రభుత్వ పాలనలో అమెరికాలో 35 రోజులపాటు షట్‌డౌన్‌ కొనసాగింది. అమెరికా చరిత్రలో ఇదే సుదీర్ఘమైన షట్‌డౌన్‌గా చెబుతుంటారు. షట్‌డౌన్‌ వల్ల లక్షల మంది ఉద్యోగులకు జీతాలు అందలేదు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)