Breaking News

భారత టూరిస్ట్‌లకు షాకిచ్చిన ట్రంప్‌

Published on Fri, 12/12/2025 - 07:37

వాషింగ్టన్‌: వీసాల విషయంలో అమెరికాలోని డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలో పర్యాటక వీసాలపై కొత్తగా హెచ్చరికలు జారీ చేసింది. ఎవరైనా అమెరికాలో ప్రసవించి... తమ పిల్లలకు పౌరసత్వం పొందాలనే ఉద్దేశంతో దరఖాస్తు చేసుకుంటే వీసాలు తిరస్కరించనున్నట్టు తాజాగా ఓ ప్రకటనలో రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.

కాగా, డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత అమెరికాలో వలసదారులకు చుక్కలు చూపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పర్యటక వీసా (Visa) జారీ విషయంలోనూ ట్రంప్‌ సర్కార్‌ అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది. తాజాగా అమెరికా గడ్డపై బిడ్డకు జన్మనిచ్చి, తద్వారా జన్మతః పౌరసత్వం పొందాలనే ఉద్దేశంతో పర్యాటక వీసా దరఖాస్తు చేసుకుంటే ఆ దరఖాస్తులను తిరస్కరిస్తామని ప్రభుత్వం తేల్చిచెప్పింది.

ఈ నేపథ్యంలో భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ట్విట్టర్‌ వేదికగా..‘పుట్టబోయే చిన్నారులకు అమెరికా పౌరసత్వం పొందడం పర్యాటకుల ప్రధాన ఉద్దేశంగా తాము భావిస్తే.. అటువంటి వారి వీసా దరఖాస్తులను తిరస్కరిస్తాం. ఇటువంటి వాటిని అనుమతించం’ అని పేర్కొంది. మరోవైపు తమ దేశంలోకి వచ్చే పర్యాటకుల్లో కొందరు దరఖాస్తు సమయంలో తప్పనిసరిగా తమ సోషల్‌ మీడియా హిస్టరీని అందించడాన్ని తప్పనిసరి చేసే యోచనలో ట్రంప్‌ సర్కార్‌ ఉన్న విషయం తెలిసిందే. దీంతో, H-1B వీసాదారుల సోషల్ మీడియా కార్యకలాపాల సమీక్షను కూడా విస్తరించారు. భద్రతా కారణాల దృష్ట్యా ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలిస్తామని రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.

అంతేకాకుండగా.. అమెరికా రాయబార కార్యాలయం ప్రతినిధి ఒక ప్రకటనలో, విదేశాంగ శాఖ ఇప్పటికే F, M, J వంటి విద్యార్థి, సందర్శకుల వీసా వర్గాలకు సోషల్ మీడియా ఖాతాల తనిఖీలు నిర్వహిస్తోందని తెలిపారు. ఈ సమీక్ష H-1B, H-4 దరఖాస్తుదారులకు కూడా డిసెంబర్ 15 నుంచి వర్తిస్తుంది. ట్రంప్ యంత్రాంగం ఇటీవల H-1B, H-4 దరఖాస్తుదారులందరికీ సోషల్ మీడియా స్క్రీనింగ్‌ను తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. ఇది వేలాది మంది హెచ్-1బీ వీసాదారులు, వారి కుటుంబ సభ్యులను ఆందోళనకు గురిచేస్తోంది. కాగా, ప్రతి కేసును క్షుణ్ణంగా భద్రతా సమీక్ష చేస్తామని భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)