Breaking News

సైబర్‌ దాడుల కలకలం.. మీరు ఈ సంస్థ రౌటర్‌లను వినియోగిస్తున్నారా?

Published on Thu, 12/19/2024 - 07:11

వాషింగ్టన్‌: అమెరికాలో సైబర్‌ సెక్యూరిటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఇంటర్నెట్‌ రౌటర్‌ల ద్వారా సైబర్‌ దాడులు జరిగే ప్రమాదం ఉందనే సమాచారంతో చర్యలు ఉపక్రమించింది. 

సైబర్‌ సెక్యూరిటీ దాడులపై అమెరికా అప్రమత్తమైంది. టీపీ-లింక్‌ టెక్నాలజీ కార్పొరేషన్‌కు చెందిన ఇంటర్నెట్ రౌటర్లు సైబర్ దాడులతో ముడిపడి ఉన్నాయన్న ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఆ సంస్థపై నిషేధం విధించేందుకు అమెరికా అధికారులు పరిశీలిస్తున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. అయితే చైనీస్ కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా తమ సంస్థ రూటర్లు ఉన్నాయని తెలిపారు. 

దేశంలోని వాణిజ్యం, రక్షణ, న్యాయ శాఖలు టీపీ-లింక్‌ సంస్థపై విచారణ చేసేందుకు రంగంలోకి దిగాయి. అదే సమయంలో డ్రాగన్‌ దేశానికి చెందిన సదరు సంస్థ అమ్మే టీపీ-లింక్‌ ఇంటర్నెట్‌ రూటర్‌ అమ్మకాలపై బ్యాన్‌ విధించేలా అధికారులు చర్యలు తీసుకోననున్నట్లు తెలుస్తోంది.

సైబర్‌ దాడులపై అనుమానంతో విచారణ చేపట్టేందుకు అమెరికా ప్రభుత్వ దర్యాప్తు ఏజెన్సీలు కంపెనీ వివరాలు చెప్పేందుకు టీపీ-లింక్‌ టెక్నాలజీ ఆశ్రయించారు. కానీ ఆ సంస్థ వివరాలు చెప్పలేదని సమాచారం. ఈ పరిణామంతో రక్షణ శాఖ సైతం చైనా కంపెనీ తయారు చేసిన రూటర్లపై ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించినట్లు అమెరికా మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.  

టీపీ-లింక్‌ రూటర్లను వినియోగిస్తే దేశంలో సైబర్‌ దాడులు జరిగే అవకాశం ఉందని, వెంటనే విచారణ చేపట్టాలని కోరుతూ అమెరికన్‌ చట్ట సభ్యులు అధ్యక్షుడు జోబైడెన్‌కు లేఖ రాశారు. అనంతరం జోబైడెన్‌ చైనా కంపెనీపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. 

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)