Breaking News

140 కోట్ల జనాభా ఉన్న దేశం మొక్క జొన్న కంకి కొనలేదా? 

Published on Mon, 09/15/2025 - 05:37

న్యూయార్క్‌: భారత్‌పై అమెరికా వాణిజ్య మంత్రి హోవర్డ్‌ లుట్నిక్‌  కక్షపూరిత వ్యాఖ్యలు చేశారు. 140 కోట్ల జనాభా ఉన్నట్లు గొప్పలు చెప్పుకుంటున్న భారతదేశం అమెరికా నుంచి ఒక్క మొక్కజొన్న కంకి కూడా కొనడంలేదని వ్యంగ్య వ్యాఖ్యలుచేశారు. అమెరికా ఉత్పత్తులపై టారిఫ్‌లు తగ్గించాలి లేదా తమ నుంచి వ్యాపారపరంగా ఎదురయ్యే గట్టి పోటీని తట్టుకోవాలని భారత్‌కు తేల్చిచెప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో లుట్నిక్‌ మాట్లాడారు. 

కొన్ని దేశాల విషయంలో స్నేహం ఒకవైపు నుంచే కొనసాగుతోందని అన్నారు. తాము స్నేహం చేస్తున్న దేశాలు తమను వాడుకొని లాభపడుతున్నాయని విమర్శించారు. వారి ఉత్పత్తులను అమెరికాలో విక్రయించుకుంటూ, అమెరికా ఉత్పత్తులను మాత్రం వారి దేశాల్లో అనుమతించడం లేదని తప్పుపట్టారు. కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థల్లో అమెరికాకు ప్రవేశం కల్పించడం లేదన్నారు. బంధం అనేది ఇరువైపుల నుంచి ఉండాలని తమ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చెప్పినట్లు గుర్తుచేశారు.

 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం అమెరికా నుంచి ఒక్క మొక్కజొన్న కంకి కూడా ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. ఇండియాది తప్పుడు విధానం కాదా? అని ప్రశ్నించారు. ఇండియా ఉత్పత్తులను అమెరికాలోకి అనుమతిస్తున్నామని, అదే పని ఇండియా ఎందుకు చేయడం లేదని పేర్కొన్నారు. పైగా తమ ఉత్పత్తులపై ఇండియాలో టారిఫ్‌లు అధికంగా ఉన్నాయని ఆక్షేపించారు. ఎదుటివారు మనకు ఎలాంటి మర్యాద ఇస్తారో మనం కూడా వారికి అలాంటి మర్యాదే ఇవ్వాలన్నది అమెరికా విధానమని లుట్నిక్‌ స్పష్టంచేశారు.

Videos

రెండు కాళ్లు లేని దివ్యాంగుడిపై దాడి.. టీడీపీ నేతల దాష్టీకం

కివీస్ తో పోరుకు బుల్డోడు అసలు కారణం ఇదే

నీ బెదిరింపులకు ఎవరూ భయపడరు దీప్తి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఐదు రౌండ్ల కాల్పులు.. టైగర్ ష్రాఫ్ కేసులో కీలక మలుపు..!

నాకు అంత కోపం రావడానికి కారణం.. నామినేషన్ వేసేటప్పుడు అసలు ఏం జరిగిందంటే

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)