Breaking News

అమెరికాతో బిగ్‌ డీల్‌ ఓకే.. భారత సైన్యంలోకి అత్యాధునిక డ్రోన్స్‌

Published on Fri, 02/02/2024 - 08:55

వాషింగ్టన్‌: భారత్‌కు అగ్రరాజ్యం అమెరికా శుభవార్త అందించింది. భారత్‌కు 31 ఎంక్యూ-9బీ సాయుధ డ్రోన్లను విక్రయించేందుకు బైడెన్‌ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు అమెరికా కాంగ్రెస్‌కు నోటిఫై చేస్తూ అవసరమైన ధ్రువీకరణను అందజేసినట్లు రక్షణ భద్రత సహకార సంస్థ (డీఎస్‌సీఏ) పేర్కొంది.

వివరాల ప్రకారం.. అమెరికా, భారత్‌ మధ్య ప్రిడేటర్‌ డ్రోన్లపై ఒప్పందం చివరి దశకు చేరుకుంది. దాదాపు 4 బిలియన్ల డాలర్ల విలువైన ఒప్పందంలో భారత్‌కు ఎంక్యూ-9బీ సాయుధ డ్రోన్ల అమ్మకానికి అమెరికా ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదిత విక్రయం అమెరికా-భారత వ్యూహాత్మక సంబంధాన్ని బలోపేతం చేయడానికి, రాజకీయ స్థిరత్వం, శాంతికి ముఖ్యమైన శక్తిగా కొనసాగనుంది. 

భారత్‌తో ప్రధాన రక్షణ భాగస్వామి భద్రతను మెరుగుపరచడంలో సహాయం చేయడం ద్వారా యునైటెడ్ స్టేట్స్ విదేశాంగ విధానం, జాతీయ భద్రతా లక్ష్యాలకు మద్దతు ఇస్తుందని డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ తెలిపింది. ఇదిలా ఉండగా.. గతేడాది ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా 31 ఎంక్యూ-9బీ స్కై గార్డియన్ డ్రోన్‌లను కొనుగోలు చేయాలని భారత్ ప్రతిపాదించిన విషయం తెలిసిందే.

ఇక, అమెరికా నిర్ణయంతో ఈ మెగా ఒప్పందం ఖరారు దిశగా పెద్ద ముందడుగు పడింది. ఆ డ్రోన్ల వల్ల భారత రక్షణ సామర్థ్యం మరింత బలోపేతం కానుంది. సముద్ర మార్గాల్లో గస్తీ, నిఘా మెరుగుపడుతుంది. మరోవైపు.. ఈ ప్రతిపాదిత ఒప్పందం కింద భారత్‌.. తన నౌకాదళం కోసం 15 సీ గార్డియన్‌ డ్రోన్లు, వైమానిక దళం, సైన్యం కోసం ఎనిమిదేసి చొప్పున స్కై గార్డియన్‌ డ్రోన్లను సమకూర్చుకోనుంది. కాగా, భారత నౌకాదళం ఇప్పటికే రెండు సీ గార్డియన్ డ్రోన్లను ఉపయోగిస్తోంది. 

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)