Breaking News

ఇరాన్‌పై భీకర పోరు : అత్యవసరంగా ఇజ్రాయెల్‌కు 12 వేల బాంబులు

Published on Sat, 03/07/2026 - 16:00

ఇరాన్‌తో యుద్ధం ముదురుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు అత్యవసర ఆయుధాల అమ్మకానికి అమెరికా ఆమోదం తెలిపింది. అత్యవసర మినహాయింపు ద్వారా (కాంగ్రెస్‌ ఆమోదం అవసరం లేకుండా) ఇజ్రాయెల్‌కు 151.8 మిలియన్ల డాలర్ల విలువైన 12,000 బాంబు కేసింగ్స్‌ను (ఒక్కొక్కటి1,000 పౌండ్ల బరువు) విక్రయించనుంది. 

ఇజ్రాయెల్ ప్రభుత్వానికి వెంటనే విక్రయించాల్సిన అత్యవసర పరిస్థితి వచ్చిందని విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో సమర్ధించుకున్నారు.  తద్వారా ఆయుధ ఎగుమతి నియంత్రణ చట్టంలోని సెక్షన్ 36(b)ను  మినహాయించినట్టు  చెప్పారు.   ఈ ప్రతిపాదిత అమ్మకం ప్రస్తుత, భవిష్యత్తు ముప్పులను ఎదుర్కోవడానికి ఇజ్రాయెల్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందనీ, దాని రక్షణను బలోపేతం చేస్తుందని  అని స్టేట్ డిపార్ట్‌మెంట్ బ్యూరో ఆఫ్ పొలిటికల్-మిలిటరీ అఫైర్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
 

ఇదీ  చదవండి: బాతు పొట్టలో గ్రా. 10 గోల్డ్‌ , ఉబ్బితబ్బిబ్బైన యజమాని

అత్యవసర మినహాయింపు (Emergency Waiver) అంటే సాధారణంగా ఇలాంటి అమ్మకాలకు కాంగ్రెస్ ఆమోదం అవసరం. అయితే, సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో "ఆర్మ్స్ ఎక్స్‌పోర్ట్ కంట్రోల్ యాక్ట్" కింద తనకున్న ప్రత్యేక అధికారాన్ని ఉపయోగించి కాంగ్రెస్‌తో సంబంధం లేకుండా ఈ విక్రయాన్ని వేగవంతం చేశారు. అమెరికన్ రక్షణ సంస్థలు తమ అత్యాధునిక ఆయుధాల ఉత్పత్తిని నాలుగు రెట్లు పెంచడానికి అంగీకరించాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ ఆయుధాల సరఫరా వల్ల ఇజ్రాయెల్ తన రక్షణను బలోపేతం చేసుకోవడమే కాకుండా, ప్రాంతీయ ముప్పులను అడ్డు కోవడానికి సహాయపడుతుందని బ్యూరో ఆఫ్ పొలిటికల్-మిలిటరీ అఫైర్స్ తెలిపింది.

ఇదీ చదవండి: పెట్రోల్ , డీజిల్ ధరల షాక్‌ తప్పదా? వైరల్‌ వీడియో

దీనిపై విమర్శలు
 ఈ నిర్ణయంపై అమెరికాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  కాంగ్రెస్ సమీక్షను దాటవేయడం ట్రంప్ ప్రభుత్వం చేస్తున్న వాదనలకు విరుద్ధంగా ఉందని . డెమొక్రాటిక్ నాయకుడు గ్రెగొరీ మీక్స్ విమర్శించారు. ప్రభుత్వం యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని చెబుతూనే, ఇలా "అత్యవసర" అధికారాన్ని వాడటం విడ్డూరంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)