Breaking News

మళ్లీ చర్చల వంతు: ట్రంప్‌

Published on Tue, 08/04/2026 - 05:49

కైరో/వాషింగ్టన్‌: ఇరాన్‌ విషయంలో గత కొన్ని వారాలుగా క్షిపణులు, డ్రోన్లకు పనిచెప్పిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తాజాగా మంతనాల కోసం మధ్యవర్తులకు పనిచెప్పారు. యుద్ధంలో మారణహోమం తప్పితే సత్ఫలితాలు ఏమీ ఉండవని, అందుకే చర్చల పర్వానికి తెరతీస్తున్నానని సోమవారం ప్రకటించారు. ఈ మేరకు అధ్యక్షుని అధికార విమానం ‘ఎయిర్‌ఫోర్స్‌ వన్‌’లో మీడియాతో ట్రంప్‌ మాట్లాడారు. ‘‘ఇరాన్‌పై కనివినీ ఎరుగని స్థాయిలో దాడులకు సిద్ధమయ్యాం. 

రెండో ప్రపంచయుద్ధం తర్వాత ఎన్నడూ ఎవరూ చూడని భీకరస్థాయిలో ఇరాన్‌పై దాడులు చేయాలని నిర్ణయించాం. తీరా రణరంగంలోకి దూకే వేళ పశ్చిమాసియాలో సౌదీ అరేబియాసహా మా మిత్రదేశాలు వద్దు అని వారించాయి. చర్చల మార్గం తెరచే ఉందని గుర్తుచేశాయి. అందుకే మళ్లీ చర్చల మార్గంలో అమెరికా పయనిస్తోంది. చర్చలకు రావాలని ఇరాన్‌ అధికారులు సైతం ఆహ్వానాలు అందాయి. అందుకే సోమవారం నుంచి మధ్యవర్తుల ద్వారా చర్చలు మొదలుపెడతాం’’అని ట్రంప్‌ ప్రకటించారు.   

చర్చలు లేవన్న ఇరాన్‌ 
ఇరాన్‌ సోమవారం ట్రంప్‌ ప్రకటనకు భిన్నంగా స్పందించింది. ‘‘ఒమన్‌తో మాత్రమే మేం చర్చలు జరుపుతున్నాం. అది కూడా నౌకల సురక్షిత ప్రయాణ అంశంపై చర్చిస్తున్నాం. అమెరికాతో ప్రస్తుతం సంప్రతింపుల ప్రక్రియ నిలిచిపోయింది’’అని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీ సోమవారం స్పష్టంచేశారు.  

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)