Breaking News

రణరంగంలోకి భీకర బాంబర్‌

Published on Fri, 03/06/2026 - 06:05

అణుచర్చల విషయంలో ‘దౌత్యం’విఫలమై దిగాలుగా కూర్చున్న వేళ ‘యుద్ధం’ఒళ్లువిరిచి రణక్షేత్రంలో కరాళనృత్యం చేస్తుండగా ఆ నృత్యాన్ని మరింత రక్తికట్టించేందుకు అమెరికా తన అమ్ముల పొదిలోని బీ–52 స్ట్రాటోఫోర్ట్రెస్‌ బాంబర్‌ భారీ విమానాలను రంగంలోకి దింపింది. ఏడు దశాబ్దాలకు పైగా ఈ యుద్ధవిమానాలు అమెరికా వా­యుసేనలో కీలకభూమిక పోషిస్తున్నాయి. ఒకే­సారి 32,000 కేజీల బరువైన బాంబులను జారవిడిచే సత్తా ఉన్న ఈ విమానాల రాకతో రణరీతులు మారనున్నాయని యుద్ధరంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. 

అన్నీ భారీస్థాయిలో.. 
→ 1955 ఫిబ్రవరిలో అమెరికా వాయుసేన కోసం బోయింగ్‌ సంస్థ ఈ విమానాలను తయారుచేసి ఇచి్చంది. ఆనాటి నుంచి పలు మిలటరీ ఆపరేషన్లలో చురుగ్గా పాల్గొంటూ అప్పగించిన పనిని అద్భుతంగా పూర్తిచేశాయి.  

→ ప్రచ్ఛన్నయుద్ధకాలంలో సోవియట్‌ రష్యాకు వ్యతిరేకంగా అణ్వాయుధాలను ప్రయోగించేందుకు ఎనిమిది ఇంజిన్లతో భారీ బాడీతో అధునాతనంగా దీనిని తయారుచేశారు. 

→ ఏకంగా 50,000 అడుగుల ఎత్తులో ఎగురుతూ సువిశాల ప్రాంతంపై తమ పట్టు నిలుపుకుని డేగ కన్నుతో పరిశీలిస్తూ అత్యంత ఖచి్చతత్వంతో బాంబులు జారవిడుస్తాయి. 

→ సెన్సార్లు మొదలు, ఆప్టికల్, ఇన్‌ఫ్రారెడ్‌దాకా అన్నిరకాల ఆయుధ వ్యవస్థలు ఇందులో ఉన్నాయి. 

→ ఈ విమానంలో ఒకేసారి 30 భారీ బాంబులను అమర్చవచ్చు. అందుకే దీనిని కింగ్‌ ఆఫ్‌ బాంబర్స్‌ అని కూడా పిలుస్తారు. 

→ ఇంధనం కోసం ఆగకుండా ఏకధాటిగా వేల కిలోమీటర్ల ప్రయాణిస్తాయి. 1991 జనవరిలో ఇరాక్‌పై దాడి కోసం ఈ విమానాలు అమెరికాలోని లూసియానాలోని బార్క్‌డేల్‌ స్థావ­రం నుంచి బయల్దేరి ఎక్కడా ఆగకుండా ఇరాక్‌­కు వచ్చి బాంబులేసి మళ్లీ అలాగే వెళ్లిపోయా­యి. అలా ఏకధాటిగా 35 గంటలపాటు 23,000 కిలోమీటర్ల ప్రయాణించి కొత్త ప్రపంచ రికార్డ్‌ను సృష్టించాయి.  

→ గగనతలంలో మధ్యస్థాయి వేగంతో ప్రయాణించే ఈ విమానం గగనతలంలో వెళ్లేటప్పుడు వచ్చే భారీ శబ్దం వినలేనంత కర్ణ కఠోరంగా ఉంటుంది. 

→ గైడెడ్‌ మిస్సైళ్లు, క్రూయిజ్‌ క్షిపణులు ఇలా వేర్వురు రకాల బాంబులను ఇవి ప్రయోగించగలవు. 

→ 225 కేజీలు, 450 కేజీలు, 900 కేజీలు ఇలా వేర్వేరు బాంబులను వేర్వేరు దిశలో ఒకేసారి ప్రయోగించగలవు. జాయింట్‌ డైరెక్ట్‌ అటాక్‌ మ్యునీషన్‌(జేడ్యామ్‌) టెక్నాలజీతో ఈ బాంబు­లు పనిచేస్తాయి. బాంబులు గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌ మాదిరి అత్యంత కచ్చితత్వంతో లక్ష్యంపై పడి శత్రువుల స్థావరాలను పూర్తిగా నేలమట్టం చేస్తాయి. 

→ వేలకిలోల బాంబులతో ప్రయాణించే ఈ విమానాన్ని టేకాఫ్‌ చేయాలంటే అత్యంత పొడవైన రన్‌వే అవసరం. ప్రస్తుతం ఇరాన్‌పై దాడుల 
కో­సం బ్రిటన్‌లోని గ్లూసిస్టర్‌షైర్‌లోని రాయల్‌ ఎ­యి­ర్‌ఫోర్స్‌ ఫెయిర్‌ఫోర్డ్‌ వైమానిక స్థావరాన్ని అమెరికా ఉపయోగించుకుంటోంది. ఈ స్థావరం­లో సువిశాలమైన ఏకంగా 9,993 అడుగుల పొడవైన రన్‌వే ఉంది. దీంతో రెక్కలకు ఎలాంటి­వి అడ్డురాకుండా సులువుగా టేకాఫ్‌ తీసుకోవచ్చు. 

→ ప్రస్తుతం హిందూ మహాసముద్రంలోని డిగో గార్షియా ద్వీపంలోని స్థావరం నుంచి ఇవి రణరంగంలోకి ప్రవేశించాయని వార్తలొచ్చాయి. 

→ ఇరాన్‌ బలగాల కమాండ్, కంట్రోల్‌ పోస్ట్‌లపై బీ–52 స్ట్రాటోఫోర్ట్రెస్‌ విమానం పెద్ద ఎత్తున దాడులు చేస్తోందని తాజాగా యూఎస్‌ సెంట్రల్‌ కమాండ్‌ కమాండర్‌ అడ్మిరల్‌ బ్రాడ్‌ కూపర్‌ వెల్లడించారు. 

→ బీ–52హెచ్‌ వేరియంట్‌ విమానం ఏకధాటిగా 15,000 కిలోమీటర్లు ప్రయాణించి 70,000 పౌండ్ల బాంబులను ప్రయోగించగలదు 

→ ప్రస్తుతం అమెరికా అమ్ములపొదిలో ఇలాంటివి 76 విమానాలు ఉన్నాయి. 

→ వియత్నాం యుద్ధం మొదలు గల్ఫ్‌ యుద్ధం, అఫ్గానిస్తాన్, ఇరాక్‌ దాకా పలు యుద్ధాల్లో పాల్గొన్న బీ–52 బాంబర్లు ఇప్పుడు ఇరాన్‌ పనిపట్టేందుకు గగనతలంలో చక్కర్లు కొడుతున్నాయి 

→ ఈ విమానాలకు ‘పెద్దగా అందవికారంగా బానపొట్టతో ఉన్న మనిషి(బిగ్‌ అగ్లీ ఫ్యాట్‌ ఫెలో–బఫ్‌)’అనే ముద్దుపేరు కూడా ఉంది.  

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు