Breaking News

అమెరికా ‘కస్టడీ’లో ఇ‍ద్దరు భారత విద్యార్థులు

Published on Sat, 01/17/2026 - 10:59

న్యూఢిల్లీ: అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన భారతీయ విద్యార్థులకు ఆందోళన కలిగించే ఘటన చోటుచేసుకుంది. సెయింట్ లూయిస్ పార్క్‌లోని ఓ ప్రముఖ భారతీయ రెస్టారెంట్‌లో అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా అక్కడ పనిచేస్తున్న పలువురు సిబ్బందిని ప్రశ్నించిన అధికారులు.. ఇద్దరు భారతీయ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం వీసా నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలతోనే ఈ ఇద్దరు విద్యార్థులను కస్టడీలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా ఈ విద్యార్థులు తమ వీసా నిబంధనలకు విరుద్ధంగా పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తున్నందువల్లే ఈ చర్యలు తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతర్జాతీయ విద్యార్థులకు ఉపాధి కల్పిస్తున్న ప్రదేశాలపై ఇటీవలి కాలంలో అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు నిఘా పెంచారు. గత కొన్ని నెలలుగా అనధికారిక ఉపాధి,వీసా నిబంధనల అమలుపై ఐసీఈ అధికారులు పలు రాష్ట్రాల్లో  ఈ తరహా చర్యలను ముమ్మరం చేశారు.
 

విద్యార్థులు చట్టవిరుద్ధంగా పనిచేస్తున్నారన్న అనుమానంతో పలు చోట్ల సోదాలు నిర్వహిస్తుండటానికి తోడు తాజా అరెస్టులతో అక్కడి భారతీయ విద్యార్థుల్లో ఆందోళన మరింతగా పెరిగింది. ఈ ఘటన నేపథ్యంలో విద్యార్థి సంఘాలు, నిపుణులు భారతీయ విద్యార్థులను అప్రమత్తం చేస్తున్నారు. ఇమిగ్రేషన్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, సరైన అనుమతులు లేకుండా క్యాంపస్ బయట ఉద్యోగాలు చేయడం లాంటి పొరపాట్లు  చేయవద్దని  సూచిస్తున్నారు. ఇటువంటి ఉల్లంఘనలు.. డిటెన్షన్, వీసా రద్దు లేదా దేశ బహిష్కరణ వంటి తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చదవండి: కెనడాలో హత్య చేసొచ్చి.. పంజాబ్‌లో హల్చల్!

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)