Breaking News

ఆత్మ గౌరవమా.. కీలక మిత్రుడా..?: జెలెన్‌స్కీ టెన్షన్‌

Published on Sat, 11/22/2025 - 07:21

కీవ్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ముందుకు తెచ్చిన శాంతి ప్రతిపాదనలపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆత్మగౌరవమా లేక కీలకమైన మిత్రుడిని కోల్పోవడమా అనే ప్రశ్న ఇప్పుడు ఉక్రెయిన్‌ ముందుందని పేర్కొన్నారు. దేశ చరిత్రలో ఇది అత్యంత కష్ట కాలమని ఆయన తెలిపారు.

ఈ మేరకు శుక్రవారం ఆయన దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఉక్రెయిన్‌ ప్రస్తుతం అత్యంత తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఇప్పుడు చాలా కష్టమైన ఎంపికను ఎదుర్కోవాల్సి రావచ్చు. దీనివల్ల గౌరవాన్ని కోల్పోవడం లేదా కీలక భాగస్వామిని కోల్పోయే ప్రమాదం ఉంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. దురాక్రమణను ఆపాలంటే కీలకమైన పారిశ్రామిక ప్రాంతం డోన్బాస్‌ను రష్యాకు వదిలివేయడం వంటి షరతులు ట్రంప్‌ ప్రతిపాదనల్లో ఉన్నట్లుగా వస్తున్న వార్తల నేపథ్యంలో జెలెన్‌స్కీ ఈ ప్రసంగం చేయడం గమనార్హం.  

ఇదిలా ఉండగా.. మూడేళ్లకు పైగా కొనసాగుతోన్న రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి ముగింపు పలికేందుకు 28 పాయింట్లతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఒక ప్లాన్ సిద్ధం చేశారు. అందులో ఎక్కువ పాయింట్లు రష్యాకు అనుకూలంగా ఉన్నాయి. ఆ ప్రతిపాదనలను అమెరికా, రష్యా అధికారులు సంయుక్తంగా రూపొందించారు. ఇటీవల దానిని జెలెన్‌స్కీ ప్రభుత్వానికి అందించారు. ఆ ప్లాన్‌ ప్రకారం.. ఉక్రెయిన్‌ తూర్పు డాన్‌బాస్‌లో ఇప్పటికే తమ నియంత్రణలో ఉన్న ప్రాంతంతో పాటు మిగిలిన ప్రాంతాన్ని రష్యాకు అప్పగించాలి. ఉక్రెయిన్ తన సైనిక బలాన్ని సగానికి సగం తగ్గించుకోవాలి. అలాగే ఆ దేశ రక్షణకు కీలకమైన అమెరికా సైనిక సహాయాన్ని ఉపసంహరించుకోవాలి. ఉక్రెయిన్ గడ్డపై విదేశీ బలగాలకు అనుమతి ఉండకూడదు. రష్యా భూభాగంలోకి దాడి చేయగల ఆయుధాలను ఉక్రెయిన్‌కు ఎవరూ అందించకూడదు. 

	ఒక్కటైన బద్ధశత్రువులు.. వైట్ హౌస్ లో 45 నిమిషాలకు పైగా భేటీ అయిన ఇద్దరు నేతలు

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)