Breaking News

శాంతి చర్చల వేళ.. ఎయిర్‌స్ట్రైక్స్‌తో భీకర దాడులు

Published on Tue, 03/11/2025 - 07:46

కీవ్‌: శాంతి చర్చల వేళ రష్యా సైన్యం(Russia Military) భీకర దాడులతో ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతోంది. తాజాగా.. రాజధాని కీవ్‌ నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో పై వైమానిక దాడులకు తెగ బడింది. అయితే.. ఆ దాడుల్ని తమ దేశ వైమానిక దళం సమర్థవంతంగా అడ్డుకుంటోందని కీవ్‌ మేయర్‌ విటాలి కీచ్‌కోస్‌ తెలిపారు. అయినప్పటికీ.. 

తమకు పేలుడు శబ్దాలు ఎక్కువగా వినిపిస్తున్నాయని కీవ్‌(Kyiv)లోని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియరావాల్సి ఉంది. మరోవైపు.. సౌదీ అరేబియాలో ఉక్రెయిన్‌, అమెరికా అధికారులు శాంతి చర్చలు(Ukraine Peace Talks) జరపనున్నారు. ఈ నేపథ్యాన్ని పట్టించుకోకుండా రష్యా దాడుల ఉధృతిని పెంచడం గమనార్హం. 

రెండు రోజుల కిందట ఖర్‌కీవ్‌ రీజియన్‌లోని డోబ్రోపిలియా నగంపై రష్యా జరిపిన క్షిపణుల దాడిలో విధ్వంసం చోటు చేసుకుంది. దాడుల్లో 14 మంది మరణించగా.. 37 మంది గాయపడ్డారు.  ఈ దాడులతో రష్యా ఉద్దేశాల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ అన్నారు. తమ పౌరుల ప్రాణాలను రక్షించుకునేందుకు ఎంతకైనా తెగిస్తామని ప్రకటించారాయన. 

ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్‌కు అమెరికా నిఘా సమాచార సహాయం నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజు నుంచే రష్యా తన దాడుల ఉధృతిని పెంచడం గమనార్హం.

 


 

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)