Breaking News

‘పుతిన్‌కు అదే గతి.. టాయిలెట్‌ కోసం బకెట్‌ పట్టుకుని నిలబడి..’

Published on Tue, 04/04/2023 - 16:10

రష్యన్‌ దళాల నుంచి విముక్తి పొంది ఏడాదైన సందర్భంగా కైవ్‌కు తూర్పున యాగిద్నే ప్రాంతంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ హాజరయ్యారు. ఆయనతో పాటు జర్మన్‌ వైస్‌ ఛాన్సలర్‌ రాబర్ట్‌ హెబెక్‌ కూడా ఆ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా జెలెన్‌స్కీ మాట్లాడుతూ..  రష్యా నాయకుడు వ్లాదిమిర్ పుతిన్ తన జీవితాంతం చీకటి నేలమాళిగలో బకెట్‌తో గడపాలని తాను ఆశిస్తున్నట్లు కీలక వ్యాఖ్యలు చేశారు.

పుతిన్‌కు అదే గతి
యుధ్దం జరుగుతున్న సమయంలో రష్యా దళాలు 367 మంది ప్రజలను యాగిద్నేలోని 200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న పాఠశాల బంకర్‌లోకి బలవంతంగా తరలించారు. 8 నెలల పాపతో సహా గ్రామస్తులను దాదాపు నెల రోజుల పాటు అక్కడే ఉంచగా, వారిలో 11 మంది చనిపోయారు. తాజాగా ఈ ప్రాంతంలో పర్యటించిన అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. అక్కడి పరిసరాలు, గ్రామ ప్రజలు పడిన నరకయాతన తెలుసుకొని చూసి చలించిపోయారు. ఇవన్నీ చూసిన తర్వాత, ఆయన దీనిపై స్పందిస్తూ.. ‘ తన మిగిలిన రోజులను టాయిలెట్ కోసం బకెట్‌తో ఇదే విధంగా బంకర్‌లో గడుపుతారని తాను ఆశిస్తున్నానని’ ఉక్రెయిన్ అధ్యక్షుడు అన్నారు.

ఆ సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారిని మరచిపోకుండా ఉండేందుకు గ్రామస్థులు వారి పేర్లు నమోదు చేయడం, పిల్లలు జాతీయగీతాన్ని రాసిన తీరును జెలెన్‌స్కీ ప్రశంసించారు. ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు అనేక నేరాలకు పాల్పడుతున్నాయని కైవ్ అధికారులు, పాశ్చాత్య ప్రభుత్వాలు ఆరోపించాయి. అయితే మాస్కో మాత్రం ఈ వాదనలను ఖండించింది.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)