రష్యాపైకి ఉక్రెయిన్‌ డ్రోన్ల దండు

Published on Thu, 06/04/2026 - 05:22

కీవ్‌: దురాక్రమణ జెండా ఎగరేసి తమ భూభాగాలను ఆక్రమిస్తున్న రష్యాపై ఉక్రెయిన్‌ డ్రోన్ల దండును పంపి దాడికి తెగబడింది. రష్యాలోని సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లోని కీలక చమురు టర్మినల్‌పై డ్రోన్లు దాడిచేశాయి. దీంతో నౌకాశ్రయం సమీప టర్మినల్‌ నుంచి అగ్నికీలలు ఎగసిపడి దట్టంగా నల్లటి పొగ వెలువడుతున్న వీడియోలను అంతర్జాతీయ మీడియా ప్రసారంచేసింది. ఉక్రెయిన్‌పై భీకరంగా రష్యా దాడి చేసి 22 మంది పౌరులను చంపేసి, 138 మందిని గాయపరిచిన ఘటన జరిగిన 24 గంటలకే రష్యాపై ఉక్రెయిన్‌ ప్రతిదాడులుచేయడం గమనార్హం. 

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తాను పుట్టిపెరిగిన సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో స్వంతంగా శుక్రవారం అంతర్జాతీయ ఆర్థిక సదస్సు నిర్వహణకు సంసిద్ధమవుతున్న వేళ ఈ దాడిజరిగింది. వేయి కిలోమీటర్ల ప్రయాణించి మరీ తమ డ్రోన్లు రష్యాలో విధ్వంసం సృష్టించాయని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ బుధవారం తన సోషల్‌మీడియా ఖాతాలో ఒక పోస్ట్‌పెట్టారు. దాడి దెబ్బకు నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసేశారు. మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను సైతం నిలిపేశారు. దాడి జరిగిన నష్టవివరాలను రష్యా ప్రభుత్వం బయటపెట్టలేదు. 

విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు రష్యా సొంతంగా అంతర్జాతీయ ఆర్థిక సదస్సును నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. ఏటా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సు జరుగుతుండగా పుతిన్‌ సారథ్యంలో జరిగేదానిని రష్యా దావోస్‌గా పిలుస్తుంటారు. మరోవైపు ఇరాన్‌ యుద్ధంతో సొంతంగా పాట్రియోట్‌ గగనతల రక్షణ వ్యవస్థను అమెరికా విచ్చలవిడిగా వాడేస్తుండటంతో మిత్రదేశమైన ఉక్రెయిన్‌కు వాటిని గతంలోమాదిరి సరఫరా చేసే పరిస్థితిలేదు. దీంతో ఉక్రెయిన్‌లో ఇప్పుడు వీటి కొరత ఎక్కువైంది. రష్యా బాలిస్టిక్‌ క్షిపణి దాడులను ఎదుర్కొనే సత్తా తగ్గిపోయిందని, యూరప్‌ దేశాలు ఇతోధికంగా సాయం చేయల్సిన అవసరం ఏర్పడిందని ఉక్రెయిన్‌ పేర్కొంది. బుధవారమే కీవ్‌లో పర్యటించిన నాటో చీఫ్‌ మార్క్‌ ఉక్రెయిన్‌ ఉన్నతాధికారులతో సమావేశంకానున్నారు.  

నౌకాస్థావరంపైనా.. 
కోల్టీన్‌ ద్వీపం సమీపంలోని రష్యా క్రోన్‌స్టార్డ్‌ నౌకాస్థావరం పైనా ఉక్రెయిన్‌ డ్రోన్లు దాడిచేశాయి. రష్యా బాల్టీక్‌ విభాగ నౌకాస్థావరం, ఆయుధాగారం సైతం ఇక్కడే ఉన్నాయి. దాడికి తెగించిన 354 డ్రోన్లను కూల్చేశామని రష్యా తెలిపింది. మరోవైపు రష్యా ఆక్రమించిన డోనెట్సషేక్‌లోని బస్సుపై ఉక్రెయిన్‌ జరిపిన దాడిలో ఏడుగురు చనిపోయారు. 11 మంది గాయపడ్డారని క్రిమ్లిన్‌ నియమించిన డోనెట్సషేక్‌ ప్రాంత చీఫ్‌ డెనిస్‌ పుషిలిన్‌ వెల్లడించారు.   

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)