Breaking News

యూఎస్‌ శాంతి ప్రణాళికపై జెనీవాలో చర్చలు

Published on Mon, 11/24/2025 - 06:23

జెనీవా: రష్యా దురాక్రమణకు పుల్‌స్టాప్‌ పెట్టేందుకు ఉద్దేశించిన అమెరికా ప్రతిపాదిత శాంతి ఒప్పందంపై ఉక్రెయిన్, పశ్చిమ దేశాల ప్రతినిధులు స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఆదివారం చర్చలు జరిపారు. యూకే, ఫ్రాన్స్, జర్మనీ జాతీయ భద్రతా సలహాదారులతో మొదటి దఫా చర్చలు ముగిశాయని ఉక్రెయిన్‌ బృందానికి నాయకత్వం వహిస్తున్న అధ్యక్షభవనం చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ ఆండ్రీ యర్మాక్‌ ఎక్స్‌లో వెల్లడించారు.

 ప్రతిపాదిత 28 పాయింట్ల ఒప్పందం పొరుగుదేశంపై దురాక్రమణకు పాల్పడిన రష్యాకే అనుకూలంగా ఉండటంపై యూరప్‌ దేశాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ప్రతిపాదనలను సమీక్షించేలా అమెరికాపై ఒత్తిడి తేవాలని ఉక్రెయిన్‌ను అవి కోరుతున్నాయి. ఈ చర్చల్లో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో, ట్రంప్‌ ప్రత్యేక దూత స్టీవ్‌ విట్కాఫ్‌ కూడా పాలుపంచుకున్నారు. 

ఉక్రెయిన్‌లో శాంతి నెలకొనే దిశగా అమెరికా బృందంతో నిర్మాణాత్మకంగా చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని యర్మాక్‌ తెలిపారు. ఈ ఒప్పందంతో దేశ సార్వభౌమత్వమా? అమెరికా మద్దతును నిలుపుకోవడమా? తేలిపోనుందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వ్యాఖ్యానించడం తెల్సిందే. ఇప్పటికే కనీసం డజను సార్లు తిరస్కరించిన రష్యా డిమాండ్లనే ఈ ఒప్పందంతో ఆమోదించాల్సి రావడం జెలెన్‌స్కీకి మింగుడు పడటం లేదు.

 ఉక్రెయిన్‌ పారిశ్రామిక రంగానికి ఎంతో కీలకమైన డోన్బాస్‌ను రష్యాకు వదిలేయడం, సైన్యాన్ని పరిమితం చేసుకోవడం వంటివి ప్రతిపాదనల్లో ఉన్నాయి. ఇవి తుది ప్రతిపాదనలు కావని, ఎలాగైనా యుద్ధాన్ని ఆపడమే తమ లక్ష్యమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అంటున్నారు. అయితే, గురువారం కల్లా ఒక స్పష్టతకు రావాలని ఆయన శనివారం ఉక్రెయిన్‌కు గడువు విధించారు. కాగా, నల్ల సముద్రంపై ఉక్రెయిన్‌ స్వేచ్ఛగా ధాన్యం రవాణా చేసేందుకు ఉద్దేశించిన గత ఒప్పందాన్ని అమల్లోకి తెచ్చేలా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సోమవారం మాట్లాడుతానని తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగన్‌ చెప్పారు.  

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)