Breaking News

రెస్టారెంట్‌లో మహిళకు వింత అనుభవం.. పాటలు విన్నారని ఊహించని షాక్‌ ఇచ్చారు!

Published on Mon, 07/17/2023 - 19:50

రెస్టారెంట్‌కు స్నేహితులతో కలిసి వెళ్లి.. టేస్టీ పుడ్‌ని లాగించేసి కాసేపు సరదాగా గడిపేసి రావడం అంటే అందరికీ ఇష్టమే. అయితే సాధారణంగా రెస్టారెంట్‌ అంటే బిల్‌ కాస్త ఖరీదుగానే ఉంటుంది కాబట్టి మనం దానికి కూడా సన్నద్ధంగానే ఉంటాం. మహా అయితే భోజనం ధరలు కాస్త ఎక్కువగా ఉండడం, సర్వీస్‌ ఛార్జీ వంటివి ఊహిస్తాం. అయితే బ్రిటన్‌లోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన మహిళకు వెయిటర్‌ ఇచ్చిన బిల్‌ చూడగానే ఊహించని షాక్‌ తగిలింది. బిల్‌లో ఇలాంటివి కూడా వేస్తారా అంటూ అసహనం వ్యక్తం చేస్తూ ఆ ఫోటోని నెట్టింట షేర్‌ చేసింది.

వివరాల్లోకి వెళితే.. బ్రిటన్‌లోని ఓ మహిళ తన స్నేహితులంతా కలిసి సరదాగా రెస్టారెంట్‌కు వెళ్లింది. ఇంకేముందు చిట్‌ చాట్‌ మొదలుపెట్టిన కాసేపటి  ఆర్డర్‌ పెట్టిన పుడ్‌ వచ్చేసింది. కబుర్లు చెప్పుకొంటూ వాటిని ఆరగించారు. చివర్లో వెయిటర్‌ తీసుకువచ్చిన బిల్‌ చూసి షాక్‌ అవ్వడం వారి వంతైంది. ఎందుకంటే  ఆ రెస్టారెంట్‌లో లైవ్‌ మ్యూజిక్‌ కార్యక్రమం నడుస్తోంది. యాజమాన్యం ఆ పాటలు విన్నందుకు 8 పౌండ్లు బిల్‌లో చేర్చింది.  ఏం చేయాలో తోచక వారు బిల్లు చెల్లించి బయటకు వచ్చేశారు.

తరువాత తమకు ఇలాంటి అనుభవం ఎదురైందంటూ రెస్టారెంట్ నిర్వాహకులు ఇచ్చిన రసీదును సోషల్‌మీడియాలో షేర్‌ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. ఇలాంటివి యూకేలో మునుపెన్నడూ లేవంటూ ఈ ఫోటో చూసిన నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఆ బిల్లులో మరికొన్ని ఫీజులు ఉండటంతో రెస్టారెంట్ యాజమాన్యం పుడ్‌ లవర్స్‌ ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారని కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

చదవండి: 2,600లకు పైగా విమానాలు రద్దు.. ప్రయాణికులకు ఎయిర్‌లైన్స్‌ విజ్ఞప్తులు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)