Breaking News

అమెరికా..  ఉక్రెయిన్‌ మధ్య సయోధ్య ఎలా?

Published on Mon, 03/03/2025 - 05:36

లండన్‌: అధినేతలు డొనాల్డ్‌ ట్రంప్, జెలెన్‌స్కీ వాగ్యుద్ధంతో అమెరికా, ఉక్రెయిన్‌ సంబంధాలు అకస్మాత్తుగా దెబ్బతిన్న వైనం యూరప్‌ను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. వాటిని తిరిగి చక్కదిద్దే మార్గాల కోసం అవి మల్లగుల్లాలు పడుతున్నాయి. ఈ అంశంపై చర్చించేందుకు యూరప్‌ దేశాధినేతలు ఆదివారం లండన్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇందుకు బ్రిటన్‌ ప్రధాని కియర్‌ స్టార్మర్‌ చొరవ తీసుకున్నారు.

 ‘సురక్షిత యూరప్‌ కోసం’ పేరిట జరిగిన ఈ శిఖరాగ్ర సమావేశంలో చర్చంతా అమెరికా, ఉక్రెయిన్‌ సంబంధాల చుట్టే తిరిగినట్టు సమాచారం. ఉక్రెయిన్‌కు మరిన్ని నిధులు అందించాలని నేతలు నిర్ణయానికి వచ్చారు. అవసరమైతే యూరప్‌ దేశాలన్నీ తమ సైన్యాన్ని కూడా ఉక్రెయిన్‌కు పంపేందుకు సిద్ధంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. ఈ కీలక భేటీలో జెలెన్‌స్కీతో పాటు కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో కూడా పాల్గొన్నారు.  

తరానికోసారే! 
యూరప్‌ భద్రత కోసం ఖండంలోని దేశాలన్నీ ఒక్కతాటిపైకి రావాల్సిన అవసరముందని స్టార్మర్‌ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇలాంటి అవసరం, అవకాశం తరానికి ఒక్కసారి మాత్రమే వస్తాయని అన్నారు. ‘‘రష్యా బారి నుంచి ఉక్రెయిన్‌కు శాశ్వత రక్షణ కల్పించాలి. యూరప్‌లోని ప్రతి దేశం భద్రతకూ ఇది చాలా కీలకం’’ అని చెప్పారు. ‘‘ఇందుకు మూడంచెల మార్గముంది. ఉక్రెయిన్‌ను సాయుధంగా పటిష్టపరచాలి. దాని భద్రతకు యూరప్‌ మొత్తం పూచీగా ఉండాలి.

 ఇక ఉక్రెయిన్‌తో కుదిరే ఒప్పందాలను రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మళ్లీ తుంగలో తొక్కకుండా చూసే బాధ్యతను అమెరికా తీసుకోవాలి’’ అని ప్రతిపాదించారు. అంతకుముందు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌తో స్టార్మర్‌ విడిగా భేటీ అయ్యారు. అందులో జెలెన్‌స్కీ కూడా పాల్గొన్నారు. రష్యా, ఉక్రెయిన్‌ కాల్పుల విరమణకు నిర్దిష్ట కార్యారణ ప్రణాళిక రూపొందించి అమెరికా ముందుంచాలని వారు నిర్ణయానికి వచ్చారు. ఈ ప్రయత్నంలో మిగతా యూరప్‌ దేశాలన్నింటినీ కలుపుకుని వెళ్తామని చెప్పారు. అంతకుముందు ఉక్రెయిన్‌కు 3.1 బిలియన్‌ డాలర్ల రుణం అందించేందుకు బ్రిటన్‌ అంగీకరించింది.

ట్రంప్‌తోనూ మాట్లాడా: స్టార్మర్‌ శిఖరాగ్రం అనంతరం నేతలు మీడియాతో మాట్లాడారు. వీలైనంత త్వర లో మరోసారి సమావేశమై అన్ని అంశాలపైనా లోతుగా చర్చించుకోవాలని  నిర్ణయించినట్టు స్టార్మర్‌ వెల్లడించారు. అమెరికా నమ్మదగ్గ భాగస్వామి కాదన్న విమర్శలను తోసిపుచ్చారు. రష్యా, ఉక్రెయిన్‌ మధ్య శాంతి ఒప్పందం యూరప్‌ భద్రతకు చాలా కీలకమని పునరుద్ఘాటించారు. ఈ విషయమై ట్రంప్‌తో శనివారం రాత్రి ఫోన్లో సుదీర్ఘంగా మాట్లాడినట్టు వివరించారు. ‘‘యూరప్‌ ఒకరకంగా నాలుగు రోడ్ల కూడలిలో నిలిచింది. కనుక ప్రతి అడుగూ ఆచితూచి వేయాల్సిన సమయమిది. పరిస్థితులన్నీ పూర్తిగా అదుపు తప్పేందుకు ఒకే ఒక్క తప్పుడు నిర్ణయం చాలు’’ అని హెచ్చరించారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)