పిల్లలకు సోషల్ మీడియా వద్దు!

Published on Tue, 01/20/2026 - 04:36

లండన్: 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ బ్రిటన్‌లోని అధికార లేబర్ పార్టీకి చెందిన 61 మంది ఎంపీలు ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రధాని సర్ కీర్ స్టామర్‌ను ఉద్దేశించి రాసిన ఈ లేఖలో, పిల్లల మానసిక ఆరోగ్యం, భద్రతపై సోషల్ మీడియా ప్రతికూల ప్రభావం చూపుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

డెన్మార్క్, ఫ్రాన్స్, నార్వే, న్యూజిలాండ్, గ్రీస్ వంటి దేశాలు ఇప్పటికే ఇలాంటి చట్టాలను అమలు చేయడానికి సిద్ధమవుతున్నాయని ఎంపీలు లేఖలో పేర్కొన్నారు. బ్రిటన్ కూడా ఈ దిశగా ముందడుగు వేయాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు.

ఈ అంశంపై ఇప్పటికే ప్రధాన ప్రతిపక్ష పార్టీ కన్జర్వేటివ్ పార్టీతో పాటు లిబరల్ డెమోక్రాట్లు కూడా తమ మద్దతు ప్రకటించారు. కన్జర్వేటివ్ పార్టీ నేత కెమి బాడ్నోచ్ ఇటీవల పార్లమెంట్‌లో మాట్లాడుతూ, తమ పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే 16 ఏళ్లలోపు పిల్లలందరికీ సోషల్ మీడియాపై నిషేధం విధిస్తామని ప్రకటించారు.

ఈ పరిణామాలతో అధికార లేబర్ ఎంపీల డిమాండ్‌కు ప్రతిపక్షాల నుంచి కూడా మద్దతు లభిస్తున్న పరిస్థితి ఏర్పడింది. దీనిపై స్పందించిన ప్రధాని కీర్ స్టామర్, ప్రభుత్వం ఈ అంశాన్ని ఓపెన్ మైండ్‌తో పరిశీలిస్తోందని, అన్ని అవకాశాలను సమగ్రంగా అధ్యయనం చేస్తామని తెలిపారు.

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)