Breaking News

ఖలిస్థానీల ముసుగులో అక్రమ వలసలు.. 

Published on Fri, 07/28/2023 - 12:32

లండన్: భారత అక్రమ వలసదారులకు ఇంగ్లాండ్‌లో ఎలాగోలా ఆశ్రయం కల్పించేందుకు బ్రిటీష్ లాయర్లలో కొంతమంది అడ్డదారులు తొక్కుతున్నారు. వీరంతా మాఫియాలా ఏర్పడి బాధితుల నుండి నగదు వసూలు చేసి బదులుగా ఖలిస్తానీలుగానూ, స్వలింగ సంపర్కులగానూ చెప్పి భారత్‌లో తమ ప్రాణాలకు ముప్పు ఉన్నట్లు కోర్టుకు చెప్పమని చెబుతున్నట్టు ఓ ప్రముఖ మీడియా సంస్థ వెల్లడించింది. ఓ స్టింగ్ ఆపరేషన్ ఆధారంగా ఈ విషయాన్ని తెలుసుకున్న బ్రిటన్ ప్రధాని తీవ్రస్థాయిలో స్పందించారు. వీరిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

భారత్ నుంచి ఇంగ్లాండ్ వలసవచ్చే వారిలో ఎవరైనా సరైన డాక్యుమెంట్లు లేకుండా అక్కడ అడుగుపెట్టారా.. వారు అక్కడి లాయర్ల చేతికి చిక్కినట్లే. పడవల్లో వలస వచ్చే భారతీయులే ఈ లాయర్ల ప్రధాన లక్ష్యం. వీరికి ఇంగ్లాండ్‌లో ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండాలంటే మతాంతర వివాహం చేసుకున్నామని, స్వలింగ సంపర్కులమని, ఖలిస్తానీ మద్దతుదారులమని చెప్పమంటున్నారు.  

మీరు కోర్టుకి ఈ మాట చెబితే చాలు మీ ప్రాణానికి భారత్‌లో ప్రాణహాని ఉందని కోర్టుని నమ్మిస్తానని దీనికోసం 5500 యూరో పౌండ్లను సిద్ధం చేసుకోవాలని ఒక రిపోర్టర్ చేసిన స్టింగ్ ఆప‌రేష‌న్‌లో లాయర్ చెబుతుండగా వీడియో తీశారు. ఈ వీడియో ప్రధాని రిషి సునాక్ కు చేరడంతో ఆయన ఈ వ్యవహారంపై చాలా సీరియస్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇటువంటి కార్యకలాపాలకు మేమెప్పుడూ వ్యతిరేకమే. ప్రతిపక్ష లేబర్ పార్టీవారు,  కొంతమంది లాయర్లు, క్రిమినల్ గ్యాంగులు వారి జేబులు నింపుకోవడం కోసం అక్రమ వలసదారులకు చట్టవ్యతిరేక మార్గంలో సహాయపడుతున్నారు. దీన్ని ఎలా ఆపాలో నాకు తెలుసనీ అన్నారు.  

ఇది కూడా చదవండి: ఏకాంతంగా బ్రతకాలనుకున్నారు.. చివరికి...

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)