కెనడా: వేధింపుల కేసులో పంజాబ్ యువకుడు అరెస్ట్!

Published on Tue, 07/28/2026 - 11:56

బర్లింగ్టన్‌: కెనడాలోని బర్లింగ్టన్‌లో ఉబర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న పంజాబ్‌కు చెందిన మన్‌దీప్ సింగ్ (25) లైంగిక దాడి ఆరోపణలపై అరెస్టయ్యాడు. హాల్టన్ ప్రాంతీయ పోలీసు సేవల (హెచ్‌ఆర్‌పీఎస్‌)వివరాల ప్రకారం, గత నెల జూన్ 16న సాయంత్రం 5:15 గంటలకు బర్లింగ్టన్ గో స్టేషన్ పార్కింగ్ స్థలంలో ఈ సంఘటన జరిగింది. మన్‌దీప్ సింగ్ బాధితురాలితో మాట్లాడే సమయంలో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అక్కడి నుంచి మహిళ వెంటనే పారిపోవడానికి ప్రయత్నించగా, నిందితుడు ఆమెను సమీపంలోని ఒక వ్యాపార కేంద్రం వరకు వెంబడించి రెండోసారి కూడా లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.

ఈ సంఘటనలో బాధితురాలికి ఎలాంటి శారీరక గాయాలు కాకపోయినప్పటికీ, ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు దర్యాప్తును చైల్డ్ అబ్యూజ్ అండ్ సెక్సువల్ అసాల్ట్ యూనిట్ చేపట్టింది. దర్యాప్తులో భాగంగా ఎటోబికోక్ నివాసి అయిన మన్‌దీప్ సింగ్‌ను జూలై 26న పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై లైంగిక దాడి అభియోగాలను మోపి, మిల్టన్‌లో బెయిల్ విచారణ నిమిత్తం అదుపులో ఉంచారు. నేరం జరిగిన సమయంలో నిందితుడు ఉబర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నందున, మరికొందరు బాధితులు ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఎవరి దగ్గరైనా సమాచారం ఉంటే తమను సంప్రదించాలని అధికారులు ప్రజలను కోరారు.

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)