యూఏఈలో లాంగ్‌ జర్నీ.. ప్రభుత్వం కీలక సూచనలు

Published on Sat, 07/11/2026 - 00:42

అబుదాబి: యూఏఈలో తీవ్ర వేసవి వేడి కొనసాగుతున్న నేపథ్యంలో రహదారి ప్రమాదాలు, వాహనాల యాంత్రిక లోపాలను నివారించేందుకు అంతర్గత మంత్రిత్వ శాఖ (MoI) వాహనదారులకు కీలక భద్రతా సూచనలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న ‘ప్రమాద రహిత వేసవి’ రహదారి భద్రతా ప్రచారంలో భాగంగా, ప్రయాణానికి ముందు వాహనాన్ని పూర్తిగా తనిఖీ చేయాలని సూచించింది.

ముఖ్యంగా ఇంజిన్ కూలింగ్ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తోందో లేదో నిర్ధారించుకోవాలని, రేడియేటర్‌లో కూలెంట్ లేదా నీటి స్థాయిని పరిశీలించాలని అధికారులు తెలిపారు. అలాగే ఇంజిన్ ఆయిల్ సరిపడా ఉందో లేదో చెక్ చేయడంతో పాటు, టైర్ల పరిస్థితి, గాలి ఒత్తిడి, బ్రేకుల పనితీరును తప్పనిసరిగా పరీక్షించాలని సూచించారు. రాత్రి ప్రయాణాలు లేదా సుదూర ప్రయాణాల ముందు హెడ్‌లైట్లు, బ్రేక్ లైట్లు, టర్న్ ఇండికేటర్లు సరిగా పనిచేస్తున్నాయో లేదో కూడా నిర్ధారించుకోవాలని పేర్కొన్నారు.

అంతేకాకుండా వాహనంలో అవసరమైన అత్యవసర భద్రతా పరికరాలు అందుబాటులో ఉంచాలని, ఎండలో కారులో సులభంగా మంటలు అంటుకునే వస్తువులు, ప్రెషరైజ్డ్ కంటైనర్లు, లైటర్లు లేదా సువాసన స్ప్రేలు వంటి వస్తువులను వదిలివేయొద్దని హెచ్చరించింది. వీలైనంత వరకు వాహనాన్ని నీడ ఉన్న ప్రదేశాల్లో పార్క్ చేయాలని, స్టీరింగ్ వీల్ అధికంగా వేడిగా ఉంటే వెంటనే ప్రయాణం ప్రారంభించకుండా కొంతసేపు చల్లబడిన తర్వాతే డ్రైవ్ చేయాలని సూచించింది.

ఈ ముందుజాగ్రత్తలు పాటించడం వల్ల ఓవర్‌హీటింగ్, టైర్ పేలిపోవడం, ఆకస్మిక యాంత్రిక వైఫల్యాలు వంటి సమస్యలను గణనీయంగా తగ్గించవచ్చని అధికారులు తెలిపారు. ముఖ్యంగా సుదూర ప్రయాణాలకు ముందు వాహనం పూర్తిగా రోడ్డుకు అనుకూల స్థితిలో ఉందని నిర్ధారించుకోవడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని అంతర్గత మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)