రూ. 63.01 కోట్ల కొకైన్‌ : ఇద్దరు భారతీయ ట్రక్‌ డ్రైవర్లు అరెస్ట్‌

Published on Thu, 01/08/2026 - 18:42

భారత్‌కు చెందిన ఇద్దరు  ట్రక్ డ్రైవర్లను డ్రగ్స్‌ కేసులో  అమెరికాలోని  ఇండియానా పోలీసులు అరెస్ట్‌ చేశారు.  రూ. 63.01 కోట్ల విలువైన 309 పౌండ్ల కొకైన్ రవాణా చేస్తూ పట్టుబడ్డారు. ఇది లక్షకు పైగా (1,13,000)అమెరికన్లను చంపేంత ప్రమాదకరమని  డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS)  ట్రిసియా మెక్‌లాఫ్లిన్ తెలిపారు.

గురుప్రీత్ సింగ్ (25) జస్వీర్ సింగ్ (30)  అమెరికాలోని  ఇండియానాలో  అదుపులోకి తీసుకున్నారు.   వీకెండ్‌ హైవే  తనిఖీల్లో అనుమానాస్పందగా ప్రయాణిస్తున్న వీరి వాహనాంలో కొకైన్‌ తరలిస్తున్నట్టు  గమనించి  స్నిఫర్ డాగ్ యూనిట్ అధికారులను అప్రమత్తం చేశారు. కోర్టు రికార్డుల ప్రకారం, "ట్రక్కు  సెమీ-ట్రక్కు స్లీపర్ బెర్త్‌లో దుప్పటితో కప్పిన  అట్టపెట్టెల్లో 140 కిలోల కొకైన్‌ను పోలీసులు గుర్తించారు. దీంతో ఇద్దరు డ్రైవర్లను అరెస్ట్‌ చేసి పుట్నం కౌంటీ జైలుకు తరలించారు. నిందితులు మాదకద్రవ్యాలను విక్రయించారన్ననేరారోపణలు ఎదుర్కొంటున్నారని, బహిష్కరణ చర్యలు తీసుకుంటామని ఇండియానా రాష్ట్ర పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: బిచ్చగాడిలా బతికాడు, చనిపోయాక డబ్బు కట్టలు చూసి అందరూ షాక్‌!

అయితే నిందితులు దీన్ని ఖండించారు. ట్రక్కు లోపల ఏముందో తమకు తెలియదని, తమ ట్రక్కింగ్ కంపెనీ ట్రక్కును రిచ్‌మండ్‌లోని ఒక భారతీయ రెస్టారెంట్‌కు తీసుకెళ్లి లోడ్ కోసం వేచి ఉండమని ఆదేశించిందని చెప్పారు. గురుప్రీత్ సింగ్ 2023, మార్చి 11న అరిజోనా నుండి అక్రమంగా యుఎస్‌లోకి ప్రవేశించగా,  జస్వీర్ సింగ్ 2017 ,మార్చి 21న కాలిఫోర్నియా నుండి అక్రమంగా అమెరికాలోకి  ప్రవేశించాడని అధికారులు  పేర్కొంటున్నారు. వీరిద్దరికీ కాలిఫోర్నియా వాణిజ్య డ్రైవింగ్ లైసెన్స్‌లను మంజూరు చేసింది. మరోవైపు కాలిఫోర్నియాలోని శాన్ బెర్నార్డినోలో చోరీ కేసులో జస్వీర్‌ను గత నెలలో అరెస్టు చేశారు.

ఇదీ చదవండి: మహిళను కాల్చి చంపిన ఇమ్మిగ్రేషన్‌ ఏజెంట్‌, వీడియో వైరల్

Videos

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)