Breaking News

రష్యాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు

Published on Sun, 07/20/2025 - 16:56

రష్యా తీరంలో భారీ భూకంపం సంభవించింది. ప్రకంపనల తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 7.4గా నమోదైంది. రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంతో పాటు హవాయిలోని కొన్ని ప్రాంతాలకు పసిఫిక్‌ సునామీ హెచ్చరికల కేంద్రం సునామీ హెచ్చరికలను జారీ చేసింది. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. ముందు జాగ్రత్తగా పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు అప్రమత్తం చేశారు.

పెట్రోపావ్లోవ్స్క్-కామ్చాట్కా నగరానికి తూర్పున 143 కిలోమీటర్ల దూరంలో పసిఫిక్‌ మహా సముద్రంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీనికి ముందు దాదాపు గంట సమయంలోనే ఈ ప్రాంతంలో ఐదు భూకంపాలు నమోదైనట్లు యూఎస్‌జీఎస్‌ తెలిపింది.

ఈ భారీ భూకంపాలు.. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:28 నుంచి 3:49 గంటల మధ్య సంభవించాయి. ఈ భూకంపాల కారణంగా కొన్ని భవనాలు దెబ్బతిన్నాయని, అయితే ప్రాణ నష్టం గురించి ఇప్పటివరకు స్పష్టమైన సమాచారం వెల్లడికాలేదు. ఈ భూకంపం వల్ల సునామీ వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరించారు.

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)