Breaking News

ట్రంప్‌ తీరుతో ఇబ్బందిపడ్డ మనవరాలు!

Published on Mon, 09/08/2025 - 21:23

యూఎస్‌ ఓపెన్‌ 2025 ఫైనల్‌ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. న్యూయార్క్‌ క్వీన్స్‌ వేదిక వద్దకు ట్రంప్‌ రాక సందర్భంగా భద్రతా తనిఖీలతో అభిమానులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఈ క్రమంలో.. అర్థర్‌ యాష్‌ స్టేడియం రోల్స్‌ బాక్స్‌ వద్దకు వచ్చి అభివాదం చేసిన ఆయనకు.. చీర్స్‌తో పాటు బూస్‌(నిరసనగా చేసే నినాదాలు) స్వాగతం పలికాయి. తమను ఇబ్బందిపెట్టినందుకు టెన్నిస్‌ అభిమానులు ఆయన్ని తిట్టిపోశారు. ఈ క్రమంలో.. మరో ఆసక్తికరమైన అంశమూ తెర మీదకు వచ్చింది.

ట్రంప్‌ మనవరాలు అరబెల్లా కుష్నర్(18) ఆయన తీరుతో ఇబ్బందిపడినట్లుగా ఓ వీడియో తెగ వైరల్‌ అవుతోంది. ట్రంప్‌ మొదటి భార్య ఇవానా కూతురు ఇవాంకా. ఇవాంకా భర్త జారెడ్ కుష్నర్‌ కాగా.. వీళ్లిద్దరికి ముగ్గురు సంతానం. అందులో పెద్ద కూతురు అరబెల్లా. ట్రంప్‌ కుటుంబంతో తరచూ ఈమె మీడియా కంట కనిపిస్తుంటుంది. ఈ క్రమంలో యూఎస్‌ ఓపెన్‌ పురుషుల ఫైనల్‌ మ్యాచ్‌ కోసం ట్రంప్‌ అల్లుడిని, మనవరాలిని, వైట్‌హౌజ్‌ సిబ్బందినీ వెంటపెట్టుకుని వచ్చారు.  

ఆ సమయంలో అరబెల్లా ఆందోళనగా కనిపించగా.. ట్రంప్‌ ఆమెతో ఏదో అ‍న్నారు. దీంతో ఆమె ముఖం చిన్నబోయింది. ఆపై ట్రంప్‌ పక్కన నిల్చునేందుకు కూడా ఆమె అయిష్టంగా కనిపించింది. అప్పటి నుంచి ఈవెంట్‌ అయ్యేదాకా ఆమె ముభావంగా ఉండిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోనే ఇప్పుడు విపరీతంగా వైరల్‌ అవుతోంది. 

లిప్ రీడర్ నికోలా హిక్లింగ్ చెబుతోంది ఏంటంటే.. అరబెల్లా తన బ్యాగ్, ఫోన్ కోసం ఆందోళన వ్యక్తం చేసింది. Where is my bag?(నా బ్యాగ్‌ ఎక్కడ?) అని అడిగింది. దానికి ఆమె తండ్రి కుష్నర్ I don’t have it(నాకు తెలియదు) అని సమాధానమిచ్చారు. ఈలోపు.. తాత ట్రంప్‌ను తనకు దారి ఇవ్వమని కోరగా.. ఆయన నువ్వు అక్కడే ఉండు అని చెప్పారు. దీంతో ఆమె అయిష్టంగా అలా నిలబడి పోయారు. 

ఇదిలా ఉంటే.. యూఎస్‌ ఓపెన్‌ నిర్వాహకులు ట్రంప్‌ అక్కడ ఉన్న సమయంలో జరిగిన పరిణామాలను టెలికాస్ట్‌ చేయొద్దని బ్రాడ్‌కాస్టర్లకు సూచించింది. అయినప్పటికీ సోషల్‌ మీడియా ద్వారా ప్రెసిడెంట్‌ ట్రంప్‌నకు తగిలిన నిరసన సెగ, అంతకుమించి అరబెల్లా వైరల్‌ వీడియో బయటకు వచ్చేసింది. 

ఈ వీడియో వైరల్ కావడంతో, నెటిజన్లు ట్రంప్ కుటుంబ సంబంధాలపై చర్చ ప్రారంభించారు. ఆమె ముఖంలో ఆందోళన, అసౌకర్యం స్పష్టంగా కనిపించిందని.. పాపం అంటూ మరొక యూజర్‌ కామెంట్‌ చేశాడు. అరబెల్లాకు ట్రంప్‌ పక్కన నిలబడడానికి ఇష్టపడలేదని.. అందుకే తండ్రి చెంతకు చేరిందని కొందరు అభిప్రాయపడ్డారు. వీలైనంత త్వరలో ట్రంప్‌ కుటుంబం నుంచి ఆమె బయటకు రావడం ఖాయమంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు