Breaking News

కెనడా విమానాలపై 50% టారిఫ్‌లు

Published on Sat, 01/31/2026 - 05:21

వాషింగ్టన్‌: కెనడాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి టారిఫ్‌ల బాంబు పేల్చారు. అమెరికాలో విక్రయించే కెనడా విమానాలపై ఏకంగా 50 శాతం సుంకాలు బాదుతానని ప్రకటించారు. తన సోషల్‌ మీడియా వేదిక ట్రూత్‌సోషల్‌ పోస్టులో ఈ మేరకు పేర్కొన్నారు. జార్జియాకు చెందిన అమెరికా కంపెనీ గల్ఫ్‌స్ట్రీమ్‌ ఏరోస్పేస్‌కు చెందిన జెట్‌ విమానాలను సర్టిఫై చేసేందుకు కెనడా నిరాకరించిందంటూ ఆయన ఈ మేరకు బెదిరింపులకు దిగారు.

కెనడా నిర్ణయానికి ప్రతిచర్యగా బొంబార్డియర్‌తో పాటు ఆ దేశానికి చెందిన అన్ని కంపెనీల విమానాలనూ తాము కూడా డీసర్టిఫై చేస్తామని హెచ్చరించారు. బొంబార్డియర్‌ విమానాల గుర్తింపు రద్దు తక్షణం అమల్లోకి వస్తుందని కూడా ప్రకటించారు. బొంబార్డియర్, గల్ఫ్‌స్ట్రీమ్‌ ఒకరకంగా ఆగర్భ శత్రువులు. ట్రంప్‌ ప్రకటనపై మాంట్రియల్‌కు చెందిన బొంబార్డియర్‌ కంపెనీ వెంటనే స్పందించింది. ఆయన హెచ్చరికలపై కెనడా ప్రభుత్వంతో చర్చిస్తున్నట్టు చెప్పింది.

కెనడాపై కత్తులు
కెనడాపై కొంతకాలంగా ట్రంప్‌ కత్తులు నూరుతున్నారు. ముఖ్యంగా కెనడా ప్రధాని మార్క్‌ కార్నీకి, ఆయనకు నడుమ సంబంధాలు బాగా బెడిసికొట్టాయి. కార్నీని ట్రంప్‌ తరచూ ‘కెనడా గవర్నర్‌’ అని సంబోధిస్తూ హేళన చేస్తున్నారు. పెద్ద దేశాల ఒంటెత్తు పోకడల వల్ల అంతర్జాతీయ ఒప్పందాలకు విలువే లేకుండా పోతోందంటూ ట్రంప్‌ తీరును దావోస్‌ వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం వేదిక నుంచే కార్నీ తూర్పారబట్టారు.

అప్పటినుంచీ వారి నడుమ మాటల యుద్ధం కొనసాగుతోంది. చైనాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటే కెనడాపై టారిఫ్‌లను ఏకంగా 100 శాతానికి పెంచుతానని ఇటీవలే ట్రంప్‌ బెదిరించడం తెలిసిందే. అయినా కార్నీ చైనాలో పర్యటించడమే గాక ఆ దేశంతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు.  
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)