Breaking News

మోదీతో మాట్లాడేందుకు సిద్దంగా ఉన్నా.. దెబ్బకు దిగొచ్చిన ట్రంప్‌!

Published on Wed, 09/10/2025 - 07:21

వాషింగ్టన్: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై అమెరికా అదనపు సుంకాలు విధించిన దరిమిలా ఇరుదేశాల సంబంధాలు బీటలు వారాయి. అయితే యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇరు దేశాల మధ్య వాణిజ్య అడ్డంకులను పరిష్కరించుకునేందుకు అమెరికా- భారత్‌లు తిరిగి చర్చలు ప్రారంభిస్తాయన్నారు.

తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో ట్రంప్ ఒక పోస్ట్‌లో ‘భారత్‌- యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలు వాణిజ్య అడ్డంకులను తొలగించుకునేందుకు చర్చలు కొనసాగిస్తున్నాయని ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను. రాబోయే రోజుల్లో నా  స్నేహితుడు, ప్రధాని మోదీతో మాట్లాడేందుకు నేను ఎదురుచూస్తున్నాను. ఇరు దేశాల మధ్య జరిగే వాణిజ్య చర్చలకు విజయవంతమైన ముగింపు వచ్చేందుకు ఎటువంటి ఇబ్బంది ఉండదని  ఖచ్చితంగా అనుకుంటున్నాను’ అని పేర్కొన్నారు.
 

రష్యా చమురు కొనుగోళ్లపై అదనంగా 25 శాతం జరిమానాతో పాటు భారతీయ వస్తువులపై అమెరికా 50 శాతం సుంకాన్ని విధించిన కొన్ని వారాల దరిమిలా ఈ ప్రకటన రావడం గమనార్హం. దీనికిముందు అధ్యక్షుడు ట్రంప్ వైట్ హౌస్‌లో ఒక ప్రకటన చేస్తూ, భారత్‌-అమెరికా సంబంధాలను చాలా ప్రత్యేకమైనవిగా పేర్కొన్నారు. తాను, ప్రధాని మోదీ ఎప్పటికీ స్నేహితులుగా ఉంటామని ధృవీకరించారు. ఆందోళన చెందేందుకు ఏమీ లేదని స్పష్టం చేశారు. అయితే ప్రదాని మోదీ తీరుపై అసంతృప్తి  ఉందని కూడా కామెంట్‌ చేశారు.

ప్రస్తుత సమయంలో భారతదేశంతో సంబంధాలను పునరుద్ధరించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?" అని ఏఎన్‌ఐఐ అడిగినప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ‘నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. నేను మోదీకి ఎప్పటికీ స్నేహితుడినే. ఆయన గొప్ప ప్రధానమంత్రి. అయితే ఈ నిర్దిష్ట సమయంలో ఆయన చేస్తున్నది నాకు నచ్చడం లేదు. కానీ భారత్‌- అమెరికా మధ్య చాలా ప్రత్యేకమైన సంబంధం ఉందన్నారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)